Kidney Detox Fruits: కిడ్నీల్లోని టాక్సిన్స్ ను శుభ్రం చేసే 5 పండ్లు.. రెగ్యులర్‌గా తినండి..!

Kidney Detox Fruits: పండ్లలో విటమిన్స్ మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటితో మన  కిడ్నీలకు కూడా ఆరోగ్యకరం. ముఖ్యంగా కిడ్నీల్లోని టాక్సిన్స్ ను క్లీన్ చేసే ఫిల్టర్ గా పనిచేస్తాయి. కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇది మన శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించేస్తుంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం కొన్ని రకాల పండ్లు మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి. అలాంటి కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.
 

1 /5

దానిమ్మ: మన కిడ్నీలను డిటాక్స్‌ చేసి ఆరోగ్యకరంగా మార్చే పండ్ల జాబితాలో దానిమ్మ ఒకటి. ముఖ్యంగా ఇందులో కిడ్నీలో ఫాస్ఫేట్, ఆక్సలేట్, సిట్రేట్ ,కాల్షియం సమతుల్యం చేస్తుంది.కిడ్నీలు క్లీన్‌ చేయడంలో దానిమ్మ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.   

2 /5

ఆరెంజ్ : సాధారణంగా ఆరెంజ్‌, నిమ్మరసం రెండిటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. ఈ సిట్రస్‌ పండ్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. సీజనల్‌ వ్యాధులు రాకుండా కాపాడతాయి.ఆరెంజ్ కిడ్నీలను శుభ్రపరచడంలో బాగా సహాయపడుతాయి.   

3 /5

ద్రాక్ష: ద్రాక్షపండ్లు మూడు రంగులు ఉంటాయి. ఇవి కూడా సిట్రస్‌ పండ్లు. ద్రాక్ష కూడా కిడ్నీలను డిటాక్స్‌ చేసే ఆరోగ్యకరమైన పండ్లు. ముఖ్యంగా ఇందులో నేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాకుండా ఎర్ర ద్రాక్షలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ ద్రాక్ష పండ్లలో కిడ్నీ వాపును నిరోధించే ఫ్లేవనాయిడ్స్ ఇందులో ఉంటాయి.   

4 /5

పుచ్చకాయ: కిడ్నీలను క్లీన్ చేసే మరో పండు పుచ్చకాయ. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయలోని లైకోపీన్ కిడ్నీ మంటను తగ్గిస్తుంది. ఈ పుచ్చకాయ మూత్రపిండాలను డిటాక్సిఫై చేసి, కిడ్నీల్లోని విషపదార్ధాలను బయటకు పంపించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.   

5 /5

బెర్రీ: ముఖ్యంగా బెర్రీ జాతికి చెందిన పండ్లలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ,ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. కిడ్నీలను క్లీన్‌ చేసే ఎఫెక్టీవ్‌ రెమిడీ ఇందులో ఉన్నాయి. బెర్రీ పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x