Diabetes Controlling Masala: డయాబెటిస్ నానాటికి పెరుగుతున్న ఓ అనారోగ్య సమస్య. పిల్లలు పెద్దాలు అనే తేడా లేకుండా ఇది ఎవ్వరినీ వదలట్లేదు. ముఖ్యగా ఫ్యామిలీ హిస్టరీ, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఇతర అనారోగ్య సమస్యల వల్ల వస్తుంది.
డయాబెటిస్ నానాటికి పెరుగుతున్న ఓ అనారోగ్య సమస్య. పిల్లలు పెద్దాలు అనే తేడా లేకుండా ఇది ఎవ్వరినీ వదలట్లేదు. ముఖ్యగా ఫ్యామిలీ హిస్టరీ, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఇతర అనారోగ్య సమస్యల వల్ల వస్తుంది. ఇది జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుస్తుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు, హోం రెమిడీలతో మధుమేహం సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం.
మన అందరి వంటగదుల్లో మసాలాలు ఉంటాయి. ఇందులో మీరు ఎప్పుడైనా జాపత్రి పేరు విన్నారా? దీన్ని బిర్యానీల్లో వేసి వండుతారు. ఈరోజు ఈ మసాలా గురించే మనం చెప్పుకోబోయేది. దీంతో మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా వివిధ అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
అంతేకాదు జాపత్రిలో ఉండే మాసిలిగ్నన్ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. జాపత్రిలో కిడ్నీల్లో రాళ్లను సైతం కరిగించే గుణం ఉంటుంది. అంతేకాదు ఇది జీర్ణసమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
జాపత్రిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు అర్థరైటిస్ తో బాధపడేవారికి ప్రయోజనాన్నిస్తాయి. కీళ్లనొప్పులకు మంచి ఉపశమనంగా పనిచేస్తాయి.
బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జాపత్రిని డైట్లో చేర్చుకుంటే ఎక్కువ సేపు ఆకలివేయదు. దీంతో బరువు పెరుగుతామనే భయం ఉండదు. కడుపులో గ్యాస్ రాకుండా కాపాడే అంశాలు జాపత్రిలో పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ జీర్ణక్రియ మెరుగవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )