Rooms in Tirumala: తిరుమల కొండ మీద రూమ్ లు దొరకట్లేదా..?.. ఇది ఫాలో అయితే పక్కా రూమ్.. డిటెయిల్స్ మీకోసం..

Tirumala room facilities:  ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అయితే.. కొందరు మాత్రం ముందుగా అన్నిరకాల ప్లాన్ లు చేసుకుంటారు. ఎక్కడ దిగాలి, ఏయే కార్యక్రమాలలో పాల్గొనాలలో ముందుగానే ఆలోచిస్తుంటారు. కానీ మరికొందరు సడెన్ గా తిరుమలకు వెళ్తుంటారు.

1 /8

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు వెళ్లాలని భక్తులంతా తపిస్తుంటారు. కొందరు మెట్ల మార్గం ద్వారా ఎంత కష్టమైన శ్రీవారిని తలుచుకుంటూ తిరుమలకు వెళ్తుంటారు. ఎక్కడి నుంచో వందల కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి  స్వామి వారి దర్శనం కోసం కళ్లు కాయలు కాచే వరకు వేచీచూస్తుంటారు.

2 /8

ముఖ్యంగా తిరుమలకు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. దీంతో దర్శనానికి కొన్నిసార్లు 24 గంటల సమయంకూడా పడుతుంది. ఇక వీఐపీలు, సీనియర్ సిటీజన్లు, దివ్యాంగులు, ప్రత్యేకమైన కోటా కింద వచ్చే వారికి టీటీడీ ప్రత్యేకంగా దర్శనం ఫెసిలిటీని కల్గిస్తుంది. 

3 /8

ఇక ఈ మధ్యనే ఆగస్టునెలలో స్వామి వారి వివిధ సేవలలో పాల్గొనేందుకు వీలుగా ఆన్ లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో టికెట్ లు విడుదల చేసింది. ఈ టికెట్ లను ముందుగా బుక్ చేసుకున్న వారికి,  స్వామి వారికి ఆయా సేవా కార్యక్రమాలలో పాల్గొనే వెసులు బాటు కల్పిస్తుంటారు. 

4 /8

ఇక మరోవైపు ప్రస్తుతం తిరుమలలో గోవింద రాజస్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వాహనసేవ కన్నుల పండుగగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ ఊరేగింపు వేడుకగా జరిగింది.

5 /8

భక్తులు అడుగడుగునా స్వామి వారికి మంగళ కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల కొండపై కొందరు రూమ్ లు దొరడం లేదని బాధపడుతుంటారు. 

6 /8

తిరుమలలో చాలా మంది కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కడ దిగాలో.. ఏంచేయాలో అర్థంకాక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఉన్న వారు, సెలబ్రీటీలు, పోలీసులు, రాజకీయనేతలు ఎక్కడైన దిగుతుంటారు. కానీ సామాన్యులు మాత్రం బిక్కు బిక్కు మంటూ ఎదురు చూస్తుంటారు.

7 /8

అయితే తిరుమలలో అనేక మఠాలు భక్తులకు ఆవాసం కల్పిస్తుంటాయి. దీనిలో నామమాత్రంగా చార్జీలు వసూలు చేస్తారు. మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:  Mool Mutt Ph:0877-2277499.  Pushpa Mantapam Ph:0877-2277301. Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317. Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187. Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.

8 /8

Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302. Sri Vaykhanasa Divya Siddanta Vivardhini Sabha Ph:0877-2277282. Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370. Sri Pushpagiri Mutt Ph-0877-2277419. Sri Uuttaradi Mutt Ph-0877-2277397. Udupi Mutt Ph-0877-2277. ఈ నంబర్లను ఫోన్ లు చేసుకుని తిరుమలలో ఆనందంగా వసతిని పొందవచ్చు.