పందిపిల్లతో పాదయాత్ర చేసిన టాలీవుడ్ దర్శకుడు రవిబాబు

Nov 2, 2018, 07:01 PM IST

వైవిధ్యమైన చిత్రాలను తీయడంలో రవిబాబు పెట్టింది పేరు

1/6

రోటీన్‌కి భిన్నంగా సినిమాలు తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న దర్శకుడు రవిబాబు.. ఈ చిత్రానికి కూడా డైరెక్షన్ చేయడం విశేషమని అంటున్నారు పలువురు సినీ అభిమానులు.

2/6

నవంబర్ 7 తేదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నవంబర్ 2వ తేదిన సాయంత్రం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు పందిపిల్లతో పాదయాత్ర  చేశారు రవిబాబు.

3/6

అభిషేక్‌ వర్మ, నభా నటేశ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పందిపిల్ల పేరు "బంటి".  

4/6

ఈ సినిమాలో పందిపిల్ల నిజంగా ఉండేలా కనిపించడానికి లైవ్‌ యాక్షన్‌ 3డి యానిమేషన్‌ టెక్నాలజీని ఉపయోగించారట.  

5/6

ఈ చిత్రంలో పందిపిల్లకు నటకిరీటి రాజేంద్రప్రసాద్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం

6/6

సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.