Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..

Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు త్రిష బర్త్ డే సందర్బంగా ఇన్నేళ్ల కెరీర్‌లో త్రిష తెలుగు టాప్ మూవీస్ విషయానికొస్తే..

1 /7

వర్షం.. (Varsham) ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాతో త్రిషకు తెలుగులో మంచి బ్రేక్ వచ్చింది. ఒక రకంగా ప్రభాస్, త్రిషకు తొలి హిట్ ఈ సినిమాతో దక్కింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరు వెనుదిరిగి చూసుకోలేదు.

2 /7

నువ్వొస్తానంటే నేనొద్దాంటానా.. (Nuvvosthanante Nenoddantana) ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్ద్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష నటనకు మంచి మార్కులే పడ్డాయి.  

3 /7

అతడు.. (Athadu) సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ అతడు. ఈ సినిమాలో త్రిష తన నటనతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది.

4 /7

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.. (Aadavari Matalaku Ardhale Verule) వెంకటేష్ హీరోగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'. ఈ సినిమా కూడా త్రిష కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

5 /7

కింగ్ (King) శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచింది.

6 /7

కృష్ణ (Krishna) రవితేజ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'కృష్ణ'. ఈ మూవీ త్రిష కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయింది.  

7 /7

పొన్నియన్ సెల్వన్ (Ponniyin selvan 1&2) పొన్నియన్ సెల్వన్.. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష్ హీరో, హీరయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇతర భాషల్లో సక్సెస్ కాలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x