Happy Raksha Bandhan 2024 In Telugu: రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుగులో.. ఇలా పంపండి..

Happy Raksha Bandhan 2024 Wishes Quotes And Images: ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన సోమవారం వచ్చింది. కాబట్టి చాలామంది అక్క చెల్లెలు తమ సోదరుల మధ్య బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి వారి మణికట్టుకు రాఖీలను కడతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు తమ అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా తెలపండి.
 

1 /10

అక్కా, నీ ప్రేమ నా జీవితంలో అద్భుతమైన వరం. నీతో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది.. రక్షాబంధన్ శుభాకాంక్షలు..

2 /10

ఈ రక్షాబంధనం మన బంధాన్ని మరింత అందంగా మార్చాలని ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరికి రాఖీ పండగ శుభాకాంక్షలు..  

3 /10

అన్నయ్య, నువ్వు నాకు ఎప్పుడూ ఆదర్శం.. నీ మార్గదర్శనం నన్ను సరైన దారిలో నడిపిస్తుంది.. రాఖీ పండగ శుభాకాంక్షలు..  

4 /10

అక్కా, నీ ఆశీర్వాదం నా జీవితానికి దిక్సూచి.. నీ ప్రేమ నాకు ఎల్లప్పుడూ అద్భుతమైన శక్తి.. రాఖీ పండగ శుభాకాంక్షలు..  

5 /10

నీవు ఎల్లప్పుడూ కలలు కంటూ.. అవి నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు..  

6 /10

ఈ రక్షా బంధనం మన బంధాన్ని మరింత మెరుగుపరిచి, ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా జీవించేటట్లు ఉంచాలని కోరుకుంటూ.. హ్యాపీ రాఖీ పౌర్ణమి..  

7 /10

అన్నయ్య, నువ్వు నాకు ప్రేరణ, స్ఫూర్తి.. నీ ఆశీర్వాదం నాకు ఎంతో బలం.. రక్షాబంధన్ శుభాకాంక్షలు..  

8 /10

అక్కా, నీ ప్రేమకు నేను ఏమిచ్చినా తక్కువే.. ఈ రక్షాబంధన్ నీకు మరింత ఆనందం, సంతోషం, శ్రేయస్సులు ఇవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ రాఖీ పౌర్ణమి.. .  

9 /10

రాఖీ బంధం ఎంతటిదో వివరించలేము..కానీ ఈ బంధం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ.. రాఖీ పండగ శుభాకాంక్షలు..   

10 /10

అన్నయ్యకు చెల్లెలు ప్రాణం, చెల్లెలికి అన్నయ్య దైవం..రక్షాబంధన్ శుభాకాంక్షలు..