Stocks to watch: స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ లో ఉన్నారా. అయితే వచ్చే ఏడాది మంచి ఛాన్సులు ఉణ్నాయి. 2025లో ఈ షేర్లతో పోర్టుఫోలియే సిద్ధం చేసుకుంటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురవడం ఖాయం.
Top stocks for 2025: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది.మధ్య కొంచెం నష్టాలు తప్పా చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల్లోనే ఉన్నారు. వచ్చే ఏడాది కూడా మార్కెట్ మంచి లాభాల్లో ఉండే అవకాశం ఉంది. 2025లో ఏ స్టాక్‌లు మంచి లాభాలను ఇస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రశ్నకు బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సమాధానమిచ్చారు. వచ్చే సంవత్సరం కూడా మంచి పనితీరు కనపరిచే పది స్టాక్స్ జాబితాను ఇప్పుడు చూద్దాం.
CICI బ్యాంక్ మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ రంగ ICICI బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. ఈ బ్యాంకు షేర్లలో బలమైన వృద్ధి కనిపిస్తోందని చెప్పారు. దీని టార్గెట్ ధరను రూ.1,550గా సంస్థ ఉంచింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు రూ.1,298.95 వద్ద ట్రేడవుతోంది.
HCL టెక్నాలజీస్ ఐటీ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కోసం మోతీలాల్ ఓస్వాల్ టార్గెట్ ధర రూ. 2,300గా నిర్ణయించారు. ఇది కంపెనీ ప్రస్తుత ధర రూ. 1,892 కంటే దాదాపు 21.6% ఎక్కువ. ఈ ఐటీ కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయపడింది.
Zomato Ltd బ్రోకరేజ్ సంస్థ Zomato టార్గెట్ ధరను రూ. 330గా నిర్ణయించగా, దాని ప్రస్తుత ధర రూ.274.50. మోతీలాల్ ఓస్వాల్ 20.2శాతం జంప్ అయ్యే అవకాశం ఉంది. రానున్న కాలంలో ఫుడ్ డెలివరీ, కిరాణా విభాగాలలో మంచి వృద్ధిని అంచనా వేయవచ్చు.
లార్సెన్ & టూబ్రో మోతీలాల్ ఓస్వాల్ కొనుగోలు రేటింగ్ జాబితాలో లార్సెన్ & టూబ్రో కూడా చేర్చింది. సంస్థ దీని కోసం టార్గెట్ ధర రూ. 4,300గా ఉంచింది. ఇది డిసెంబర్ 23 నాటి ధర రూ. 3,633 కంటే దాదాపు 18.3% ఎక్కువ. ఈ కంపెనీ వృద్ధి ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్‌ఫోలియో కూడా మునుపటి కంటే బలంగా ఉంది.
నిప్పాన్ లైఫ్ ఇండియా AMC సంస్థ నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ టార్గెట్ ధరను రూ.900గా నిర్ణయించింది. మంగళవారం ఈ షేరు రూ.753 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది ఇది 19శాతం కంటే ఎక్కువ పెరగవచ్చు.
లెమన్ ట్రీ హోటల్స్ బ్రోకరేజీ సంస్థ లెమన్ ట్రీ హోటల్స్‌కు టార్గెట్ ధర రూ.190గా ఉంచింది. ఈ షేరు నిన్న పతనమై మంగళవారం రూ.151.25 వద్ద ముగిసింది. అంటే 2025లో 25.5% పెరగవచ్చని బ్రోకరేజ్ సంస్థ భావిస్తోంది.
పాలీక్యాబ్ ఇండియా మోతీలాల్ ఓస్వాల్ కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్‌లో పాలీక్యాబ్ ఇండియా మంచి పనితీరుపై నమ్మకంతో ఉన్నారు. ఈ స్టాక్ నిన్న రూ.7,077 వద్ద పతనంతో ముగిసింది. సంస్థ టార్గెట్ ధరను రూ.8,340 కోట్లుగా ఉంచింది. అంటే 17.8% జంప్ చేసే అవకాశం ఉండొచ్చు.
సిర్మా SGS టెక్నాలజీ Sirma SGS టెక్నాలజీ టార్గెట్ ధర రూ. 750 కాగా, ఇది ప్రస్తుతం రూ. 599.50 ధరలో అందుబాటులో ఉంది. అంటే 2025లో మోతీలాల్ ఓస్వాల్ 25.2% జంప్ అయ్యే అవకాశం ఉంది.
మాక్రోటెక్ డెవలపర్లు మోతీలాల్ ఓస్వాల్ 2025 లీస్టులో చివరి పేరు మాక్రోటెక్ డెవలపర్‌లది. సంస్థ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్ల టార్గెట్ ధర రూ.1,770గా నిర్ణయించింది. దీని ప్రస్తుత ధర రూ. 1,397, అంటే ఈ స్టాక్ 26.7% లాభపడవచ్చు.
(నిరాకరణ: ఇక్కడ ఇచ్చిన సమాచారం షేర్లను కొనుగోలు చేయడానికి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో ఆలోచనాత్మకంగా, మీ విచక్షణ ఆధారంగా పెట్టుబడి పెట్టండి).