Trigrahi Yogam: కన్యారాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన వర్షమే..

Trigrahi Yogam in Kanya Rasi: బుధుడు స్వక్షత్రమైన కన్యా రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి.

1 /6

నవగ్రహాల్లో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా అభివర్ణిస్తుంటాడు. బుధుడు ఒక నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ప్రవేశిండం వలన కొన్ని అద్భుత యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం బుధుడు సింహ రాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి ప్రవేశించాడు. బుధుడి కన్యా రాశి సంచారం వలన ఏయో రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో మీరు ఓ లుక్కేయండి..

2 /6

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధుడు మంచి గ్రహం. అది ఎక్కడున్న మంచే చేస్తుంది. బుధ సంచారం వలన కొన్ని రాశుల వారి జీవితాల్లో మంచి జరిగే అవకాశాలున్నాయి. బుధుడు కన్యారాశి ప్రవేశం వలన ఈ రాశుల వారికీ గత కొన్నేళుగా పడుతున్న ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా ఉన్నతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేమ లభిస్తుంది.

3 /6

కన్యారాశి : బుధుడు కన్యారాశిలో వచ్చే అక్టోబర్ 10 వరకు సంచరించబోతున్నాడు. బుధుడు కన్యారాశిలో ప్రవేశించడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ రాశిలో రవి, కేతువులు సంచరిస్తున్నారు. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల దేశంతో పాటు ప్రపంచ మానవాళిని ప్రభావితం చేస్తుంది.

4 /6

తులా రాశి.. తులా రాశి వారు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి. శుక్రుడుకు సంబంధించిన స్థానం కాబట్టి మంచి యోగం ఉంటుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఈ యేడాదిలో పెళ్లి జరిగే అవకాశాలున్నాయి.

5 /6

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికీ గత కొంత కాలంగా అనుభవిస్తున్న ఆర్ధిక కష్టాలు దూది పింజల్లా తేలిపోతాయి. తల్లి పూర్వీకుల నుండి ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.

6 /6

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.