Game Changer: గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రివ్యూ.. వైరల్ అవుతున్న షాకింగ్ ట్వీట్

Game Changer release date:మెగా ఫాన్స్ అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఎడాది సంక్రాంతి బరిలో దిగనుంది. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ బాలీవుడ్ క్రిటిక్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

1 /5

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా కనిపిస్తున్న సినిమా.. పైగా తమిళ్లో స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి. 

2 /5

డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కి సిద్ధం అవుతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసాయి సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

3 /5

తాజాగా బాలీవుడ్ క్రిటిక్ గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ అంటూ ఒక షాకింగ్ వేశారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా పెద్ద డిజాస్టర్ అంటూ ఉమైర్ సందు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మధ్యన శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అవడంతో గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కంగారుపడుతున్న సమయంలో.. ఉమైర్ ట్వీట్ ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది.  

4 /5

అయితే బాలీవుడ్ టాలీవుడ్ అని సంబంధం లేకుండా.. ఉమైర్ సెలబ్రిటీల గురించి నెగిటివ్ ట్వీట్లు వేస్తూనే ఉంటారు కాబట్టి.. ఆయన రివ్యూల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొందరు ఫాన్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రామ్ చరణ్ సంగతి పక్కన పెడితే.. శంకర్ దర్శకత్వం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   

5 /5

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కియారా అద్వానీ కూడా.. ఫైనల్ కట్ లో తన పాత్ర చూసి హర్ట్ అయిందని.. చాలా వరకు తన సన్నివేశాలు కట్ చేసేసారు అని కూడా ఉమైర్ సందు ట్రీట్ చేశారు. దీనిలో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎంతవరకు అభిమానుల అంచనాలు అందుకుంటుందో వేచి చూడాలి.