AP Weather Update:ఆంధ్ర ప్రదేశ్ లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. ఓ వైపు ఎండలు మాడు పగలగొడతున్నాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
AP Weather Update: మే నెల ప్రారంభం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు కాస్తూనే మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. మరోవ 48 గంటల్లో అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Andhra Pradesh Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ లో చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒక వైపు ఎండలు కాస్తూనే మరోవైపు క్యూములో నింబస్ మేఘాల కారణంగా వానలు పడుతున్నాయి. దీంతో పలు చోట్ల చల్లటి వాతావరణం నెలకొంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీలో వాతావరణ పరిస్థితుల విషయానికొస్తే..
Telangana Weather Update: గత కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిలా ఉన్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. అంతేకాదు నైరుతి బంగాళాఖాతంలో మే రెండో వారంలో ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ఇప్పుడు రైతుల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పలు చోట్ల కురిసిన వర్షాలకు తోడు ఈదురు గాలులు తోడు కావడంతో పలు చోట్ల స్తంభాలు నేలకొరిగాయి. అంతేకాదు అకాల వర్షాలకు ఆరుగాలం పంటలు పండించిన రైతులకు చివరకు దు:ఖమే మిగిలింది.
Heavy Rains in Telangana: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో పలు చోట్ల కురిసిన వర్షాలకు తోడు ఈదురు గాలులు తోడు కావడంతో పలు చోట్ల స్తంభాలు నేలకొరిగాయి. అంతేకాదు అకాల వర్షాలకు ఆరుగాలం పంటలు పండించిన రైతులకు చివరకు దు:ఖమే మిగిలింది.
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న మూడు రోజులు కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందన్నారు. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.
Rain Alert: ఏపీలో భానుడు భగభగ మండిపోతున్నాడు. పలు ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుండటంతో.. ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అయితే, ప్రస్తుతం వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Tomorrow Rain Alert To Andhra Pradesh These Districts: వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండగా.. అప్పుడప్పుడు వర్షాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఏపీకి వర్షం ముప్పు పొంచి ఉంది. అకాల వర్షాలు రేపు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏయే జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకుందాం.
Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిడుగు పాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఎండాకాలంలో వానలతో వాతావరణం కాస్త కూల్ అవుతోంది.
AP Heavy Rain Alert: రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పిడుగులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ క్రమంలో అకాల వర్షాల ధాటికి పంటలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు ప్రభుత్వం సూచనలను అందించింది.
AP Rain Alert News: రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉరుములతో కూడిన వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
AP Rain Alert News: రాబోయే నాలుగు రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉరుములతో కూడిన వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
Rain Alert: బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎండా కాలం ప్రారంభమై ఈ సమయంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా అల్ప పీడనం కారణంగా ఓ మోస్తరు నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. మొన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అయింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మరోవైపు ఈ రోజు తెలంగాణలో పలు జిల్లాలకు వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Orange Alert: తెలంగాణకు వాతావరణ శాఖ మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాదు రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. అంతేకాదు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పుకొచ్చారు.
Telangana Rains: తెలంగాణలో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వానలు కురుస్తాయని హెచ్చరించింది. అటు హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు గాలిలో తేమ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు మరో రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Maoist operation: తెలంగాణలో మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర బలగాలు సీరియస్ గా ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మావోయిస్టులను కంచుకోటలను బద్దలు కొట్టి వారిన నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ తో నక్సలైట్స్ ను కకావికలం చేసే పనిలో పడ్డాయి. తాజాగా తెలంగాణలోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు భారీ కూంబింగ్ చేపట్టాయి.
Heavy Rain Alert in Two Telugu States: శివరాత్రి తర్వాత చలి శివ శివ అంటూ పోతుందనేది పెద్దలు చెప్పే మాట. ప్రస్తుతం శీతాకాలం పోయి ఎండాకాలం వచ్చేసింది. పలు ప్రాంతాల్లో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది.
AP Rains: ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉఫరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారిందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.