Amazing Buildings in World: ప్రపంచంలో ఏడు వింత భవనాలు.. ఇంత వెరైటీగా ఎలా నిర్మించారబ్బా..?

Unique Architecture Buildings: ప్రపంచంలో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వింత నిర్మాణాలను ఎలా నిర్మించారని ఆశ్చర్యపోయే రీతిలో కట్టారు. ప్రపంచవ్యాప్తంగా నమ్మశక్యంకాని విధంగా నిర్మించిన నిర్మాణాలపై ఓ లుక్కేయండి..
 

  • Jul 30, 2023, 22:42 PM IST
1 /7

ఫ్రాన్స్‌లోని కేన్స్ సమీపంలో ఒక వింత నిర్మాణం ఉంది. దీని పేరు 'బబుల్ ప్యాలెస్'. దీనిని హంగేరియన్ ఆర్కిటెక్ట్ ఆంటి లోవాగ్ 1975-1989 మధ్య నిర్మించారు.   

2 /7

స్విట్జర్లాండ్‌లోని 'హాబిట్ హోల్స్' నిర్మాణం చాలా వెరైటీగా ఉంటుంది. ఇది 'ఎర్త్ హౌస్ మార్వెల్ స్టైల్' నిర్మాణం పోలీ ఉంటుంది. ఈ అద్భుతమైన ఇంట్లో ప్రజలు అనేక సంవత్సరాలుగా నివసిస్తున్నారు. 

3 /7

ముంబైలోని సైబర్‌టెక్చర్ ఎగ్ ఆఫీస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనిని హాంకాంగ్ సంస్థ రూపొందించింది. దీని డిజైన్ చాలా వింతగా.. అద్భుతంగా ఉంటుంది.  

4 /7

అమెరికాలోని ఓహియో సిటీలో నిర్మించిన బుట్ట ఆకారంలోని బాస్కెట్ బిల్డింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దీనిని పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ కూడా ఉంది. ఈ భవనం 'లాంగాబర్గర్ బాస్కెట్ కంపెనీ' ప్రధాన కార్యాలయం.

5 /7

అబుదాబిలోని సాదియత్ ద్వీపంలో ఒక ప్రత్యేకమైన భవనం ఉంది. ఇది 5 రెక్కల టవర్ ఆకారంలో ఉంది. ఇది థర్మల్ చిమ్నీల మాదిరి కనిపిస్తుంది. ఈ భవనాన్ని వింగ్ షేప్ జాయెద్ నేషనల్ మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు.

6 /7

చైనాలోని షాంఘైలో 'బ్జార్కే ఇంగెల్స్ గ్రూప్ ఆఫ్ కోపెన్‌హాగన్' రూపొందించిన రెయిన్ బిల్డింగ్ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ భవనంలో క్రీడలు, సంస్కృతి కేంద్రం ఉంది. వాటర్‌పై నిర్మించిన ఈ భవనం చాలా ప్రత్యేకంగా ఉంది.  

7 /7

అమెరికాలో 'ఇండిపెండెన్స్ టెంపుల్' నిర్మాణం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ప్రజలు శాంతిని కోరడానికి, ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తారు. స్పైరల్ డిజైన్‌తో ఉన్న ఈ భవనం ఎత్తు 300 అడుగుల వరకు ఉంటుంది.