Gold Facial Mask: నిగనిగ మెరిసే చర్మం కోసం 24K మ్యాజిక్ గోల్డ్ మాస్క్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..!

Gold Facial Mask At Home: బ్యూటీ పార్లర్ ఖర్చులు లేకుండా, ఇంట్లోనే సులభంగా చేసుకోవడానికి గోల్డ్ ఫేషియల్ ఒక అద్భుతమైన మార్గం. చర్మానికి మెరుపునిచ్చి, ఆరోగ్యాన్ని కాపాడే ఈ ఫేషియల్ కు కావలసిన పదార్థాలు అన్నీ మన ఇంట్లోనే సులభంగా దొరుకుతాయి.

Gold Facial Mask  At Home: ముఖం కాంతివంతంగా ఉండాలనే కోరికతో చాలా మంది రకరకాల ఫేషియల్ క్రీములు వాడటం, బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి ఖరీదైన ఫేషియల్‌లు చేయించుకోవడం సర్వసాధారణం. అందులోనూ గోల్డ్ ఫేషియల్ చాలా మందికి ఇష్టం. పార్టీలు, ఫంక్షన్‌లకు వెళ్లే ముందు ముఖం మెరుపు కోసం చాలా మంది గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటారు. బ్యూటీ పార్లర్ ఖర్చులు లేకుండా, ఇంట్లోనే సులభంగా చేసుకోవడానికి గోల్డ్ ఫేషియల్ ఒక అద్భుతమైన మార్గం. చర్మానికి మెరుపునిచ్చి, ఆరోగ్యాన్ని కాపాడే ఈ ఫేషియల్ కు కావలసిన పదార్థాలు అన్నీ మన ఇంట్లోనే సులభంగా దొరుకుతాయి. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.

1 /12

గోల్డ్ ఫేషియల్ చేయడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.   

2 /12

ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము, మలినాలు తొలగిపోతాయి, ఫేషియల్ నుంచి మెరుగైన ఫలితాలు వస్తాయి.   

3 /12

ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి:  

4 /12

కావలసిన పదార్థాలు: 1 చెంచా పసుపు, 1 చెంచా పెరుగు, 1/2 చెంచా తేనె, 1/4 చెంచా గోల్డ్ వార్కు (లేదా గోల్డ్ ఫ్లెక్స్)  

5 /12

తయారీ విధానం: ఒక గిన్నెలో పసుపు, పెరుగు, తేనె వేసి బాగా కలపాలి.  

6 /12

గోల్డ్ వార్కును చిన్న ముక్కలుగా చేసి, మిశ్రమానికి కలపాలి.  

7 /12

ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై పూర్తిగా అప్లై చేయాలి.  

8 /12

15-20 నిమిషాలు ఆరనివ్వండి.  

9 /12

గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.  

10 /12

మాయిశ్చరైజర్ రాసుకోండి.  

11 /12

ఈ ముఖ్పాకాన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మీ ముఖం మెరిసేలా, మృదువుగా ఉంటుంది.   

12 /12

ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ ,టాన్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.