Varuthini ekadashi 2024: ఏకాదశిని తిథిని చాలా మంది ఎంతో పండుగలా భావిస్తారు. ఈ రోజున ఏ పనులుచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. ఈసారి వరుథిని ఏకాదశి మే 4 తేదీ శనివారం రోజున వస్తుంది.
హిందు సంప్రదాయం ప్రకారం ఏకాదశిఅనేది విష్ణుదేవుడికి ఎంతో ఇష్టమైన తిథిగా చెబుతుంటారు. దీనిలో ముఖ్యంగా వరుథిని అనేది అత్యంత పవిత్రమైన రోజని పండితులు చెబుతుంటారు. ఈరోజున ఏ చిన్న పనిచేసిన అది మనకు గొప్ప ఫలితాలు కలిగేలా చేస్తుందని జ్యోతిష్యుతు చెబుతుంటారు.
వరుథిని ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచి స్నానాదులు ముగించుకోని,దేవుడికి ప్రత్యేకంగాపూజలు చేయాలి, విష్ణుదేవుడికి ప్రత్యేకంగా ఈరోజు ఎర్రటి పూలు సమర్పించాలి. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు భక్తితో అనేక రకాల పూలను పూజలలో ఉపయోగించాలి. ఏకాదశి రోజున అందుబాటులో ఉన్న ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి.
ఈరోజున ముఖ్యంగా పెళ్లి కానీ వారు, ఆర్థికసమస్యలతో సతతతమయ్యేవారు కొన్ని పరిహారాలు పాటించాలంటూ కూడా పండితులు చెబుతున్నారు. అందుకు ఎన్ని సంబంధాలుచూసిన పెళ్లి కుదరని వారు ఈరోజు రుక్మిణి, క్రిష్ణుడి వివాహావిధానం చదవాలి. అంతేకాకుండా సత్యనారాయణ పూజ వ్రతకథ చదివిన కూడా మంచి ఫలితం కల్గుతుంది.
ఆర్థిక సమస్యలున్న వారు ఈరోజు.. పేదలకు అన్నదానం చేయాలి, రావిచెట్టు అడుగుభాగంలో దీపంపెట్టాలి. నల్ల చీమలకు చక్కెరను పెట్టాలి. ఎండకాలం నడుస్తోంది. కాబట్టి రోడ్డుపక్కల చల్లని నీళ్లను అందుబాటులో ఉంచేలా చేయాలి. రోడ్డుపైన అన్నార్థులకు అన్నదానం చేయాలి. అనాథశ్రమంలో అన్నదానం చేయాలి.
ఏకాదశి రోజున విష్ణు ఆలయాలను అందంగా పూలతో అలంకరించాలి. అంతేకాకుండా.. ఈ రోజున సత్యనారాయణ వ్రతాలతో పాటు,రాత్రికి ఆలయంలో విష్ణుకు సంబంధించిన గీతాలపన చేస్తే జీవితంలో ఊహించిని అద్బుతాలు సంభవిస్తాయని చెబుతుంటారు.
వరుథిని ఏకాదశి రోజున ఎవరైతే, కాలసర్పదోషాలు, పితృదేవతలకు సంబంధించిన దోషాలున్న వారు ప్రత్యేకంగా పూజలు చేస్తే ఆయన అనుగ్రహాం వల్ల దోషా పరిహారం అవుతుంది. అంతేకాకుండా.. వరుథిని ఏకాదశి వ్రతం కూడా చేస్తే, అతి తక్కువ కాలంలోనే అలాంటి వారి జీవితంలో మంచి అద్భుతాలు సంభవిస్తాయని పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)