Bedroom Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఏ దిశలో ఇళ్లు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలనే వివరాలతో పాటు ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదనే నిబంధనలు కూడా చాలానే ఉన్నాయి. వాస్తు ప్రకారం అన్ని విషయాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Bedroom Vastu Tips: ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ింట్లో కొన్ని వస్తువుల్ని కొన్ని చోట్ల ఉంచకూడదంటారు. ఇందులో ముఖ్యమైంది బెడ్ రూమ్. బెడ్ రూమ్ సమీపంలో 5 వస్తువుల్ని ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏయే వస్తువులు ఉంచకూడదో పరిశీలిద్దాం
నీరు బెడ్ రూమ్ లో మంచి నీళ్లు ఉంచితే మీ చంద్రుడు బలహీనమై మూడ్ స్వింగ్, హార్మోన్ అసమతుల్యత, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ పడుకొనేటప్పుడు తలగడ వద్ద ఉంచకూడదు. ఇలా చేస్తే నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా మద్యలో చాలా సార్లు అంతరాయం కలుగుతుంది.
వాష్ చేయాల్సిన బట్టలు చాలామంది వాష్ చేయాల్సిన బట్టల్ని బెడ్ రూమ్ వద్ద అటూ ఇటూ ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల పడుకున్నప్పుడు నిద్రలో భయంకరమైన కలలు వస్తాయట. నెగెటివిటీ వ్యాపిస్తుందని అంటారు
ఫుట్ వేర్ మీరు పడుకునే బెడ్ సమీపంలో చెప్పులు పెట్టడం వల్ల బెడ్రూంలో నెగెటివ్ ఎనర్జీ, రోగాలు వ్యాపిస్తాయి.
మెడిసిన్స్ రాత్రి పడుకొనేటప్పుడు బెడ్ సమీపంలో మందులు ఉంచకూడదు. ఇలా చేస్తే బెడ్ రూమ్ లోకి రోగాల్ని ఆహ్వానించినట్టవుతుందని నమ్మకం. బెడ్ రూమ్ లో పెట్టకుండా ఉంటే చాలా మంచిది