Venkatesh son Arjun debut: విక్టరీ వెంకటేష్ కొడుకు అర్జున్ ఎంట్రీ ఉంటుందని, అయితే దానికి సమయం పడుతుందని వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం వెంకటేష్ చేసిన ఈ కామెంట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ విషయం గురించి పూర్తి వివరాలలోకి వెళితే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న.. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం పలు విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. తన సినీ కెరియర్లో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోని హీరో వెంకటేష్ తాజాగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే వేగంగా ప్రమోషన్స్ చేపట్టగా.. అందులో మరింత బిజీ అయిపోయారు చిత్ర బృందం.
ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా హీరోయిన్స్ గా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. ఇలాంటి సమయంలోనే బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం జరిగింది.
ఇందులో వెంకటేష్ తన కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు తన కొడుకు సినీ ఎంట్రీ పైన పలు విషయాలను తెలియజేసినట్లు తెలుస్తోంది. వెంకటేష్ కుమారుడి పేరు దగ్గుబాటి అర్జున్.. అర్జున్ సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడనే విషయంపై బాలయ్య వెంకటేష్ ను ప్రశ్నించగా..
ఈ విషయం పైన హీరో వెంకటేష్ స్పందిస్తూ.. తన కుమారుడు వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు. తాను యూఎస్ఏ లో చదువుతూ ఉన్నారు. అతనికి సినిమాలు అంటే చాలా ఫ్యాషన్ అని, సరైన సమయాన్ని చూసి తన నిర్ణయాన్ని తెలియజేస్తామంటూ తెలిపారు వెంకటేష్.
అంతేకాకుండా తన కుమారుడు కాస్త నెమ్మది అంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ తన కుమారుడు సినీ ఎంట్రీ పైన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే తన కొడుకు సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని చెప్పడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అలాగే ఈ అన్ స్టాపబుల్ షో కి డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రావడం జరిగింది. హీరో వెంకటేష్ తో పాటలు పాడించిన విషయాలను స్టెప్పులు వేయించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.