Tamannaah Bhatia: మీరు చూడని పర్సనల్ ఫోటోలు 5000 ఉన్నాయి.. తమన్నా గురించి విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్

Tamannaah Bhatia- Vijay Varma: తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ హీరోయిన్. ఈమధ్య బాలీవుడ్ లో కూడా ఎన్నో ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 

1 /5

తమన్నా గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు భాషతో పాటు.. తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్. మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తమన్నా.

2 /5

శేఖర్ కమలా దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ఈమెను.. స్టార్ హీరోయిన్గా మార్చింది. అప్పటినుంచి వరస అవకాశాలు అందుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయింది. మరోపక్క తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ.. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది తమన్నా. 

3 /5

ఈ మధ్యనే సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన బాక్ చిత్రంలో కనిపించింది. కాగా జైలర్ సినిమాలో తమన్నా చేసిన కావాలయ్యా సాంగ్ సెన్సేషన్ గా నిలిచింది.  ఇక ఈ మధ్యనే స్ట్రీ 2 సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసి మరింత మెప్పించింది .

4 /5

తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలలో కూడా ప్రస్తుతం తమన్నాకి ఆఫర్స్ వస్తున్నాయి. మరి ముఖ్యంగా వెబ్ సిరీస్ తో తెగ దూసుకుపోతోంది ఈ హీరోయిన్. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తమన్నా తాను విజయ వర్మ ప్రేమలో ఉన్నట్టు కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

5 /5

ప్రస్తుతం వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. తాజాగా విజయవర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫోన్లో.. ఎవ్వరు చూడని.. తాను, తమన్న కలిసి దిగిన ఫోటోలు 5000 ఉన్నాయని…అయితే అవి అలానే దాచుకుంటామని.. అవి తమ పర్సనల్ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం విజయ్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.