Mahalaya Amavasya 2024: 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు.. మంచి శకునమా? చెడు శకునమా? పండితులు ఏం చెబుతున్నారు?

Mahalaya Amavasya 2024 :  రానున్న పౌర్ణమి నుంచి మహాలయ పక్షం రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో మన పితరులకు తర్పణం, పిండ ప్రదానం, బ్రాహ్మణులకు పేదలకు దానధర్మాలు చేస్తారు. అయితే, ఈ సారి మహాలయ పక్షం ప్రారంభం, ముగింపు రెండూ ప్రత్యేకం.
 

1 /5

మహాలయ అమావాస్య ప్రతి ఏడాది ఆశ్వీయుజ పౌర్ణమి రోజు ప్రారంభం కానుంది. మన పితరుల కోసం ఏడాదిలో 16 రోజులు ప్రత్యేకంగా కేటాయించారు. పురాణాల ప్రకారం ఈ సమయంలో మన పూర్వీకులు భూమిపై సంచరిస్తుంటారు.  

2 /5

వారికి నల్లనువ్వులతో పిండి, తర్పణం వంటివి సమర్పిస్తే వారి ఆత్మలకు శాంతి కలుగుతుందనే నమ్మకం ఉంది. అంతేకాదు పితరులను సంతోషపరచడం వల్ల వంశవృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు ఎంతో ప్రత్యేకం.  

3 /5

ఈ ఏడాది 2024 సెప్టెంబర్‌ 17 నుంచి పితృపక్షం రోజులు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్‌ 2 మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఇది అతిపెద్ద అమావాస్య. అయితే, ఈసారి పితృపక్షం ప్రారంభమయ్యే 17వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. అలాగే అక్టోబర్‌ 2 అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. కేవలం 15 రోజుల వ్యత్యాసంతో రెండు గ్రహణాలు ఏర్పడతాయి.  

4 /5

అయితే, సూర్యగ్రహణం రాత్రి 9:13 గంటల సమయంలో ఏర్పడుతుంది. ఇది ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం రాత్రి ఏర్పడతున్న సందర్భంగా ఇది మన దేశంలో కనిపించదు. అయితే, సూర్యచంద్రులు ప్రపంచానికి ఒక్కటే కాబట్టి దీని ప్రభావం ఎంతకైనా ఉంటుంది. కాబట్టి ఇది అంత శుభకరం కాదు అని పండితులు చెబుతున్నారు.

5 /5

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)