Viral News: చనిపోయిన మహిళ తిరిగి బ్రతికింది.. స్వర్గం, నరకం మొత్తం చూసిందట.. అక్కడ ఏం ఉందంటే!

Charlotte Holmes Viral News: మరణం అనేది మానవ జీవితంలో అతిపెద్ద రహస్యాలలో ఒకటి. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో, దాని తర్వాత ఏం జరుగుతుందో అనే ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి మానవుడు ఎన్నో శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడు. అలాంటిది ఓ మహిళ క్లినికల్‌గా 11 నిమిషాలు చనిపోయి తిరిగి బ్రతికి తాను స్వర్గం, నరకంను చూశాను అని చెప్పడంతో వైద్యులు ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యారు. మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఆ మహిళ ఎవరు..? ఇంతకీ తాను నిజంగా స్వర్గం, నరకంను చూసిందా..? అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.  

1 /6

2019 అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన 68 ఏళ్ల షార్లెట్ హోమ్స్ హై బీపీతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్ కి తరలించారు.  కానీ ఆమె పరిస్థితి విషమించి స్పృహ కోల్పోయారు.  షార్లెట్ హోమ్స్ పదకొండు నిమిషాలు చనిపోయి తిరిగి బ్రతికిందని వైద్యనిపుణుల తెలిపారు. అయితే ఇక్కడే దిమ్మ తిరిగే ట్విస్ట్  చోటు చేసుకుంది.  

2 /6

షార్లెట్ హోమ్స్ చినిపోయినప్పుడు నరకాన్ని, స్వర్గం చూశాను అని  వైద్యులతో చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెకు ఏంజెల్స్‌ , కుటుంబ సభ్యలును కలిశానని చెప్పింది. ఆ తరువాత స్వర్గం ఎలా ఉందో వైద్యులకు వివరించింది. 

3 /6

ఆమె తల్లి, తండ్రి, చెల్లిని కలిశానని వాళ్ళు ముప్పై ఏళ్ల వయసులో ఉన్నట్లు కనిపించారని తెలిపారు.  స్వర్గం ఎంతో అందంగా ఉందని  అక్కడ అందమైన పువ్వులు, సుగంధబరితమైన సువాసనలు, సంగీతం కూడా విన్నారని షార్లెట్ హోమ్స్ చెప్పుకొచ్చారు.  అలాగే తను నరకంను కూడా చూశారని చెప్పుకువచ్చారు.    

4 /6

కానీ అంతలో తనని ఎవరో లాగినట్టు అనిపించిందిని తీరా చూస్తే తను ఆసుపత్రి బెడ్‌పై ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. తన పక్కన ఆమో భర్త డానీ కూడా ఉన్నారు. రెండు వారాల తరువాత షార్లెట్ హోమ్స్ కోలుకొని ఇంటి వెళ్ళారు. ఆమె తిరిగి ఇంట్టికి వచ్చాక తన అనుభవాలను ప్రతిఒక్కరితో చెబుతూనే ఉండేవారని సమాచారం.    

5 /6

2023 లో షార్లెట్ హోమ్స్  72 సంవత్సరాలు ఉన్నప్పుడు మరణించారు. ఆమె చనిపోయిన తరువాత  తన భర్త డానీ ఒక షోలో " షార్లెట్ హోమ్స్ ఎప్పుడూ మనిషి ఆశను కోల్పోకుండా ఉండాలని" కోరిందని వెల్లడించారు. 

6 /6

షార్లెట్ హోమ్స కోమాలో ఉన్నప్పుడు తాను ఆస్పత్రిలో రూమ్‌ మొత్తం పూలతో ఉందని చెప్పడం విన్నారా తాను అప్పుడే ఈ లోకంలో లేదని ఆయనకు తెలిసిందని చెప్పారు. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x