Vivo Vivo Y200t Price: 6,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వీవో బెస్ట్‌ మొబైల్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌ ఇవే!

Vivo Vivo Y200t Price: వీవో నుంచి త్వరలోనే Y సిరీస్‌ మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ సిరీస్‌కి సంబంధించిన మొబైల్స్‌ మోడల్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


Vivo Vivo Y200t Price: ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరాతో లభించే మొబైల్స్‌ సేల్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీవో కంపెనీ ఎప్పటి నుంచో ప్రీమియం కెమెరాలతో స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కూడా ఓ మంచి కెమెరా మొబైల్‌ను విడుదల చేసింది. అయితే ఆ స్మార్ట్‌ఫోన్‌ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /6

వీవో ఇటీవలే Y సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ సిరీస్‌ Vivo Y200 GT, Vivo Vivo Y200t మోడల్స్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి.   

2 /6

ఈ Vivo Y200 స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం నాలుగు వేరియంట్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్స్‌ను డెడ్ చీప్‌ ధరకే అందిస్తోంది.   

3 /6

ప్రస్తుతం Vivo Y సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ నాలుగు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ధరల వివరాల్లోకి వెళితే, 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ ధర రూ. 18,410 కాగా, 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ. 19,600 లకు లభిస్తోంది. 

4 /6

ఇక మిడిల్‌ ఎండ్‌ కాన్ఫిగరేషన్‌ వివరాల్లోకి వెళితే, 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి మొబైల్‌ రూ. 23,000 కాగా, టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర సుమారు రూ. 26,500తో లభిస్తోంది. 

5 /6

ఇక Vivo Y200 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్క్రీన్‌  2400 x 1080 పిక్సెల్‌ల పూర్తి HD రిజల్యూషన్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో  వస్తోంది. 

6 /6

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన చిప్‌సెట్‌ వివరాల్లోకి వెళితే, ఇది పూర్తిగా స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. అలాగే ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 14ను కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని ప్యాక్  సెపట్‌తో వస్తోంది.