Vivo Y78+ T1 Price: Vivo నుంచి పిచ్చెక్కించే ఫీచర్స్‌తో Y78+ (T1) ఎడిషన్‌..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..


Vivo Y78+ T1 Price: త్వరలోనే భారత మార్కెట్‌లోకి వివో నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. Vivo Y78+ (T1) ఎడిషన్‌ పేరుతో ఈ మొబైల్‌ ఫోన్‌ విడుదల కానుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

  • Aug 18, 2023, 15:54 PM IST

Vivo Y78+ T1 Price: ప్రముఖ మొబైల్‌ కంపెనీ వివో చైనాలో Vivo Y78+ (T1) ఎడిషన్‌ను ఇటీవలే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ Qualcomm Snapdragon 695 SoC చిప్‌ సెటప్‌తో మార్కెట్‌లోకి అందుబాటులో వచ్చింది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /5

వివో Y78+ (T1) ఎడిషన్‌ అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ మొబైల్‌ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

2 /5

వివో Y78+ (T1) మొబైల్‌ ఫోన్‌ 8GB LPDDR4x ర్యామ్‌  256GB UFS 2.2 ఇంబిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

3 /5

ప్రస్తుతం వివో Y78+ (T1) మొబైల్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ ధర CNY 1,599 (దాదాపు రూ. 18,200)గా ఉంది. రెండవ వేరియంట్‌  ధర CNY 1,799 (సుమారు రూ. 20,500) ఉంటుందని సమాచారం. ఇక కలర్స్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌ ఫోన్‌ 3 రంగుల్లో లభిస్తోంది.   

4 /5

వివో Y78+ (T1) 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 6.78 అంగుళాల HD+ OLED డిస్‌ప్లేని కలిగి ఉండబోతోంది. ఈ మొబైల్‌ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. 

5 /5

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే..ఈ ఫోన్‌కి 3.5mm, 5G, Wi-Fi, బ్లూటూత్ v5.1, GPS, USB టైప్ C పోర్ట్‌తో పాటు చాలా రకాల కనెక్టివిటీలు అందుబాటులో ఉన్నాయి.