Diabetes Signs: శరీరంలో బ్లడ్ షుగర్ పెరిగితే కన్పించే 5 లక్షణాలు ఇవే

Diabetes Signs: డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. మధుమేహం ఎక్కువైతే శరీరంలోని కొన్ని భాగాల నుంచి సంకేతాలు వెలువడతాయి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే ఆ ప్రభావం ఇతర అంగాలపై పడుతుంటుంది. అందుకే ఎప్పటికప్పుడు వివిధ రకాలుగా లక్షణాలు బయటపడుతుంటాయి. 

Diabetes Signs: శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే అంగాలు దెబ్బతినే అవకాశముంటుంది. అందుకే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. కొన్ని లక్షణాల ద్వారా కూడా గుర్తించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

1 /5

డయాబెటిస్ ముప్పు ఉన్నప్పుడు ముందుగా కన్పించే లక్షణాల్లో ఇదొకటి. కాళ్లు , చేతులు తిమ్మిరెక్కినట్టుగా ఉంటాయి. తరచూ ఇలా జరుగుతుంటే అప్రమత్తం కావాలి. షుగర్ ఎక్కువైనప్పుడు కాళ్లు తిమ్మిరెక్కడం జరుగుతుంటుంది. ఎందుకంటే మధుమేహం ఉంటే వ్యక్తి శరీర నరాలు బలహీనపడుతుంటాయి.

2 /5

కిడ్నీలో ఏదైనా సమస్య తలెత్తిందంటే అది డయాబెటిస్ సంకేతం కావచ్చు. డయాబెటిస్‌కు ప్రధాన కారణం కావచ్చు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. ఫలితంగా తరచూ మూత్రానికి వెళ్తుంటారు. 

3 /5

శరీరంలో ఎక్కడైనా ఏదైనా గాయం తగిలితే గాయం త్వరగా మానదు. ఇలా జరిగిందంటే ఇది డయాబెటిస్ లక్షణం కావచ్చు. దాంతోపాటు శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే గాయం మానడం ఇంకా ఆలస్యమౌతుంది.

4 /5

మీ కంటి చూపు తగ్గినా లేదా మసకగా కన్పిస్తున్నా సరే డయాబెటిస్ లక్షణం కావచ్చని గుర్తించండి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడం వల్ల కళ్లపై చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా చాలా సందర్భాల్లో దూరంలో ఉన్న వస్తువులు సరిగ్గా కన్పించవు. 

5 /5

డయాబెటిస్ ప్రారంభ లక్షణాల్లో కీలకమైంది చిగుళ్ల నుంచి రక్తం కారడం. చిగుళ్ల నుంచి అదే పనిగా రక్తం కారుతుంటే...వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది.