Wayanad Disaster Reasons: వయనాడ్ విపత్తుకు కారణాలేంటి, నది దిశ మార్చుకుందా

Wayanad Disaster Reasons: కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వయనాడ్ జిల్లాలో మరణఘోష విన్పిస్తోంది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఛళియార నది పోటెత్తడంతో నాలుగు గ్రామాలు తుడుచుపెట్టుకుపోయాయి. 150 మందికి పైగా మరణించగా ఇంకా చాలామంది ఆచూకీ లభ్యం కాలేదు. అసలీ విపత్తుకు కారణాలేంటి, ఎందుకు పసిగట్టలేకపోయారు..

Wayanad Disaster Reasons: కేరళలోని వయనాడ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చిన్న నదులు, వాగులు, వంకలు పోటెత్తాయి. ముఖ్యంగా కొండల్లోంచి ప్రవహించే ఛళియార్ నది పోటెత్తింది. 
 

1 /6

మెప్పాడి కొండ ప్రాంతంలోని కొండ చరియలు విరిగి పడి నదితో పాటు కొట్టుకొచ్చేశాయి. వెల్లువలా దూసుకొచ్చిన వరద ప్రవాహం, బురద దిగువన ఉన్న ఊర్లు ముందక్కై, చూరమల, అత్తామల, నూల్ఫుజలను ముంచెత్తాయి.

2 /6

అర్ధరాత్రి కావడంతో అందరూ గాడనిద్రలో ఉన్నారు. తప్పించుకునే అవకాశం లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలో జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధిగా మారారు. అందమైన ప్రాంతం గంటల్లో రాళ్లు రప్పలు, బురద మట్టి, శిథిలాలు, మృతదేహాలతో నిండిపోయింది. ఇప్పటి వరకూ 151 మంది మరణించినట్టు తెలుస్తోంది

3 /6

కేరళలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కొండ చరియలు విరిగి పడటం సహజమే. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అక్కడి ప్రజల్ని ఖాళీ చేయించలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సెక్రటరీ డాక్టర్ శేఖర్ లుకోస్ ఇచ్చిన సమాధానం వెంటే ఆశ్చర్యం కలుగుతుంది

4 /6

ఎందుకంటే..వాస్తవానికి మెప్పాడి కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ప్రాంతానికి కొట్టుకుపోయిన నాలుగు గ్రామాలకు మధ్య దూరం 6 కిలోమీటర్లు. కొండ చరియలతో ఏ మాత్రం సంబంధం లేని గ్రామాలివి. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతం ఏ మాత్రం జనావాసాలు లేని ప్రాంతం.

5 /6

కానీ అదంతా కిందకు కొట్టుకొచ్చి ఏ మాత్రం సంబంధం లేని ప్రాంతంలో వచ్చి పడటం ఊహించినది.నదీ ప్రవాహానికి దూరంగా, కొండలకు దూరంగా ఉన్న ఊర్లపై బురద మట్టి, కొండ చరియలు కొట్టుకురావడమేనేది పూర్తిగా ఊహించినది.

6 /6

వాస్తవానికి మెప్పాడి ప్రాంతంలో మూడు కాలనీలను అంతకు ముందు రోజే ఖాళీ చేయించారు. కానీ ఈ నాలుగు గ్రామాలపై వచ్చి పడుతుందనేది ఊహించని పరిణామం. ఛళియార్ నది వాస్తవ పరిమాణం కంటే వెడల్పు కావడంతో పాటు రెండుగా చీలి ప్రవహించడంతో ఈ విపత్తు జరిగింది.