Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..

Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్‌ భాజా బారత్‌ మొదలవ్వనున్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో 18 శుభ ముహూర్తాలు ఉన్నాయి. అంతేకాదు ఈసారి రికార్డు స్థాయిలో 48 లక్షల పెళ్లిళ్లు అవుతాయట. దీనికి రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా..
 

1 /5

ఈ ఏడాది పెళ్లిళ్లు మళ్లీ నవంబర్‌ 12తో ప్రారంభం కానున్నాయి. మూడు ముళ్లు, ఏడు అడుగులు,నిండు నూరేళ్లకు శుభముహూర్తాలు పెట్టారు మన పండితులు. ఈ సారి 18 శుభ ముహూర్తాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది చివరలో లక్షల్లో పెళ్లిళ్లు అవుతాయని అంచనా వేస్తున్నారు.  

2 /5

మొత్తం 45 రోజులపాటు ఈ ముహూర్తాలు రానున్నాయి. దీనికి దేశవ్యాప్తంగా రూ.6 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్‌ సర్వే చేసింది. నవంబర్‌ 12 నుంచి డిసెంబర్‌ 16 వరకు ఈ శుభ ముహూర్తాలు ఉన్నాయి.  

3 /5

ఈ సమయంలో వ్యాపారులకు కూడా భారీగా లాభాలు వస్తాయి. ఎందుకంటే పెళ్లి అంటేనే దుస్తులు, బంగారం ఇతర షాపింగ్‌. వెనుకడుగు వేయకుండా అప్పు చేసి అయినా ఖర్చుపెడతారు. అందుకే ఇప్పుడు వ్యాపారులకు బాగా లాభాలు ఆర్జించే సమయం. ముఖ్యంగా కిరాణా సరుకులు, ఫంక్షన్‌ హాల్స్‌, ఈవెంట్‌ మేనేజ్మెంట్‌, మేకప్‌ ఆర్టిస్టులు, డెకరేషన్‌, క్యాబ్‌,ఫోటోగ్రఫీ, బ్యాండ్‌ వారికి మంచి గిరాకీ ఉండే సమయం.  

4 /5

ఇక ఈ నవంబర్‌ డిసెంబర్‌ రెండు నెలలు కలిపి మొత్తంగా 18 ముహూర్తాలు రానున్నాయి. నవంబర్‌ నెలలో 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29. ఈ ఆ తర్వాతి నెల అయిన డిసెంబర్‌లో కూడా పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్‌ 4, 5, 9, 10, 11, 14, 15.  

5 /5

ఈ ఏడాదికి ఇవే పెళ్లి ముహూర్తాలు ఇక మరుసటి ఏడాది జనవరి సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)