Weight Loss Exercises: ఊబకాయాన్ని వేగంగా తగ్గించుకోవడానికి ప్రతి రోజు చేయాల్సి వ్యాయామాలు ఇవే!

Weight Loss Exercises: ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది వ్యాయాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఓ సారీ ట్రై చేయండి.
 

  • Aug 05, 2023, 11:24 AM IST

Weight Loss Exercises: బరువు తగ్గడానికి చాలా మంది బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్‌ ఫ్లాన్‌లను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే కొంత మంది డైట్‌ ఫ్లాన్‌లతో పాటు వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఇలా చేసేవారిలో సులభంగా ఫలితాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే శరీర బరువు తగ్గడానికి ఈ కింది వ్యాయామాలతో పాటు ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకుంటే మంచి ఫలితాలు సులభంగా పొందుతారు. అయితే వేగంగా బరువు తగ్గడానికి ఎలాంటి వ్యాయామాలు రోజూ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

1 /5

స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు తాడు జంప్‌ చేయడం వల్ల 15 నిమిషాల్లో 300 కేలరీలు బర్న్ అవుతాయి. అయితే ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మంచి శరీర ఆకృతి పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

2 /5

బరువు తగ్గడానికి చాలా మంది డైట్‌తో పాటు వ్యాయామాలు చేయడం మర్చిపోతున్నారు. కొంతమంది బద్ధకంతో వ్యాయామాలు చేయలేకపోతున్నారు. అయితే ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండెపోటు సమస్యల బారిన పడకుంగా ఉంటారు.

3 /5

వాకింగ్‌ చేయడం వల్ల కూడా సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు 8 నిమిషాల చొప్పున 2 సార్లు వాకింగ్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. 

4 /5

కొంత మందికి సైక్లింగ్ చేయడం అలవాటుగా మరింది. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాళ్ల కండాలు కూడా సులభంగా బలపడతాయి. అయితే శరీర బరువు తగ్గడానికి సైక్లింగ్ ప్రభావంతంగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతి రోజు తప్పకుండా 8 కిలో మీటర్లు సైకిల్ తొక్కాల్సి ఉంటుంది.

5 /5

స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా సులభంగా బరువును తగ్గించుకొవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు 40నిమిషాల పాట ఈత కొట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందట. దీంతో బరువు కూడా తగ్గుతారు.