Weight Loss Mistakes: ఆదునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించే క్రమంలో చాలామంది డైట్ మార్చడమే కాకుండా హెవీ వర్కవుట్స్ చేస్తుంటారు. జిమ్లో గంటల తరబడి గడుపుతుంటారు. అయినా సరే బరువు తగ్గించుకోలేకపోతుంటారు. ఎందుకీ పరిస్థితి. ఏ తప్పులు లేదా పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుందాం..
ప్రోటీన్లు అనేవి శరీరానికి చాలా అవసరం. కండరాల నిర్మాణంలో ఇవే దోహదం చేస్తాయి. వర్కవుట్స్ తరువాత మోతాదుకు మించి ప్రోటీన్లు తీసుకుంటే బరువు తగ్గరు సరికదా బరువు పెరగవచ్చు. నిర్ణీత మోతాదులోనే పప్పు, పాలకూర, గుడ్డు తీసుకోవాలి.
బరువు తగ్గేందుకు ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా చేస్తుండాలి. అదే సమయంలో మీరు తినే ఆహారంలో కేలరీలు ఎన్ని ఉంటున్నాయో కూడా ఆలోచించాలి. లేకపోతే ఎంత వ్యాయామం చేసినా ఫలితం ఉండదు.
కొంతమంది కేవలం 15-20 నిమిషాలే వ్యాయామం చేస్తుంటారు. ఇది ఏ మాత్రం ఫలితాలనివ్వదు. రోజుకు కనీసం 40-45 నిమిషాలు వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే బరువు తగ్గేందుకు అవుతుంది
అతి వ్యాయామం కొంతమంది త్వరగా బరువు తగ్గాలనే ఆలోచనతో అతిగా వ్యాయామం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. దీనివల్ల కండరాలు, ఎముకలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే ట్రైనర్ సలహా తీసుకోవాలి
కేవలం కార్డియో చేయడం చాలామంది జిమ్లో కేవలం కార్డియో ఎక్సర్సైజ్ చేస్తుంటారు. స్థూలకాయం నుంచి విముక్తి పొందేందుకు ఇదొక్కటే సరిపోదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయాలి.