Brides Market: ఇచ్చట పెళ్లికూతుర్లు అమ్మబడును, డిమాండ్ ఉంటే వేలం

ప్రపంచంలో మనకు తెలియని ప్రదేశాలు..విశేషాలు, ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఆ దేశంలోని ఓ ప్రాంతంలో పెళ్లికూతుర్ల సంత ఉందంటే నమ్ముతారా. అది కూడా స్వయంగా తల్లిదండ్రులే అక్కడికి తీసుకొస్తారు తమ అమ్మాయిల్ని. పెళ్లి కోసం ఏర్పాటయ్యే సంతలివి. ఈ సంతలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేందుకు వేలంపాట నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

Brides Market: ప్రపంచంలో మనకు తెలియని ప్రదేశాలు..విశేషాలు, ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఆ దేశంలోని ఓ ప్రాంతంలో పెళ్లికూతుర్ల సంత ఉందంటే నమ్ముతారా. అది కూడా స్వయంగా తల్లిదండ్రులే అక్కడికి తీసుకొస్తారు తమ అమ్మాయిల్ని. పెళ్లి కోసం ఏర్పాటయ్యే సంతలివి. ఈ సంతలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేందుకు వేలంపాట నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం.
 

1 /6

మార్కెట్‌లో అమ్మాయి నచ్చిన తరువాత సదరు అబ్బాయి ఆ అమ్మాయిని భార్యగా భావించుకుంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవల్సి వస్తుంది. ఆ ఇద్దరి మధ్య ఇరువురి కుటుంబ ఆదాయం, ఆస్థుల గురించి చర్చ ఉంటుంది. ఆ తరువాత పెళ్లి ధర నిర్ణయించుకుని ఖరారు చేసుకుంటారు. 

2 /6

అమ్మాయిల సంతకు వెళ్లేందుకు చాలా రోజుల ముందు నుంచే అమ్మాయిలు ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కువ డబ్బులు రావాలంటే ఎక్కువ అందంగా కన్పించాల్సి వస్తుంది. అందుకే మంచి మంచి దుస్తులు, మేకప్‌తో మార్కెట్‌కు వస్తుంటారు. 

3 /6

ఈ కమ్యూనిటీ ప్రజలు తమ అమ్మాయిల్ని ఎక్కువగా చదివించరని సమాచారం. సంతకు వచ్చే అమ్మాయిలకు ప్రధానంగా వంట వచ్చి ఉండాలి. తక్కువ వయస్సైనా ఫరవాలేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చిన తరువాత బేరం ఎంతనేది నిర్ధారితమవుతుంది. ఒక్కొక్క అమ్మాయికి 3 వందల్నించి 4 వందల డాలర్లు చెల్లిస్తుంటారని అంచనా. 

4 /6

పెళ్లికూతుర్ల మార్కెట్ కళాయిజ్దీ సముదాయం తరపున ఏర్పాటవుతుంది. పెళ్లికూతురిని కొనుగోలు చేసేందుకు వచ్చేవారు కూడా ఈ సామాజికవర్గానికి చెందినవారే అయుంటారు. ఇక్కడికి బయటి సామాజిక వర్గపు వ్యక్తి రాకూడదు. ఈ కమ్యూనిటీలో దాదాపు 18 వేలమంది ఉన్నారు. ఈ సాంప్రదాయంతో అక్కడి అమ్మాయిలకు కూడా ఎటువంటి సమస్య ఎప్పుడూ తలెత్తలేదట. ఎందుకంటే ముందు నుంచే ఇక్కడి అమ్మాయిల్ని మానసికంగా అందుకు సిద్ధం చేస్తారు. 

5 /6

బల్గేరియాలోని స్తారా జాగోర్ ప్రాంతంలో జరిగే పెళ్లికూతుర్ల మార్కెట్ లేదా సంత ఇది. ఇక్కడికొచ్చే పెళ్లికొడుకులు తమకు నచ్చిన పెళ్లికూతుర్లను కొనుగోలు చేసి పెళ్లి చేసుకోవచ్చు. ఈ మార్కెట్‌కు వచ్చేవారిలో ఎక్కువమంది అమ్మాయిలు మైనర్లే అయుంటారని ఓ నివేదిక చెబుతోంది. వీరి వయస్సు సాధారణంగా 13 నుంచి 17 ఏళ్ల మద్యలో ఉంటుంది. 

6 /6

పెళ్లికూతుర్ల మార్కెట్‌లోకి తమ అమ్మాయిల్ని తల్లిదండ్రులే స్వయంగా తీసుకొస్తారు. ఈ మార్కెట్‌లో పెళ్లికూతుర్లను కొనుగోలు చేసే పెళ్లికొడుకులు, బంధవులుంటారు. ఎవరెక్కువ వేలం పాడితే వారితో తమ అమ్మాయిల వివాహం ఖరారు చేస్తారు ఆ తల్లిదండ్రులు.