LDL Cholesterol Juices in Telugu: ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ముప్పు పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండటంతో గుండె వ్యాధులే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సరైన డైట్, జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
టొమాటో జ్యూస్ టొమాటో రుచికే కాకుండా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. టొమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదమౌతుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి కారణంగా గుండె ధమనులు శుభ్రమౌతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా ఒక గ్లాసు టొమాటో జ్యూస్ తీసుకోవాలి.
పాలకూర జ్యూస్ పాలకూర జ్యూస్ ఒక సూపర్ ఫుడ్ అని అంటారు. ఇందులో ఉండే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే నైట్రేట్స్ రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పాలకూర జ్యూస్ రోజూ తగిన మోతాదులో తీసుకోవాలి.
బీట్‌రూట్ జ్యూస్ బీట్‌రూట్ జ్యూస్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్‌రూట్‌లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాల్ని వెండల్పు చేస్తాయి. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
కాకరకాయ జ్యూస్ కాకరకాయ జ్యూస్ చేదుగా ఉన్నా ఆరోగ్యపరంగా అద్భుతమైంది. కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా బ్లడ్ షుగర్ నియంత్రణలో సైతం అద్భుతంగా పనిచేస్తుంది. కాకరకాయలో ఉంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
క్యారట్ జ్యూస్ క్యారట్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. క్యారట్‌లో లిక్విఫైడ్ ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే బీటో కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె రక్త నాళాల్ని పటిష్టం చేస్తాయి. గుండె వ్యాధుల్ని తగ్గిస్తాయి. రోజూ ఉదయం ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తాగితే మంచిది