Whatsapp and Signal app: మీరు వాట్సప్ యాప్ నుంచి సిగ్నల్ యాప్‌కు మారుతున్నట్లయితే..కచ్చితంగా 9 ఫీచర్లను మిస్ అవుతారు. అవేంటో చూద్దామా..వాట్సప్ యాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ ఫీచర్ల కారణంగా చాలామంది సిగ్నల్ యాప్ లేదా టెలీగ్రామ్ యాప్ వైపుకు మళ్లుతున్నారు. ఈ నేపధ్యంలో వాట్సప్ యాప్ వర్సెస్ సిగ్నల్ యాప్ పరిస్థితి చూద్దాం..
వాట్సప్ కేవలం మొబైల్ ద్వారా మాత్రమే కాకుండా వెబ్ బ్రౌజింగ్‌తో కూడా చాట్ చేయవచ్చు..సిగ్నల్‌లో ఇంకా ఈ ఫెసిలిటీ ప్రారంభించలేదు.
వాట్సప్‌లో ఆన్‌లైన్‌లో అవతల వైపు ఎవరున్నారో తెలుసుకోవచ్చు..కానీ సిగ్నల్‌లో ఆ పరిస్థితి గానీ ఆ వెసులుబాటు గానీ లేదు.
సిగ్నల్ యాప్, వాట్సప్ యాప్‌కు మరో తేడా...ఇందులో ఉండే లైవ్ లొకేషన్ షేరింగ్. సిగ్నల్‌లో లొకేషన్ షేరింగ్ ఉంది కానీ..లైవ్ లొకేషన్ షేరింగ్ అవకాశం లేదు.
వాట్సప్‌లో గ్రూప్ కాలింగ్ ద్వారా ఒకరి కంటే ఎక్కువ మందికి కాల్ చేసుకునే వీలుంది కానీ సిగ్నల్‌లో ఈ సౌకర్యం టెస్టింగ్ దశలో ఉంది. ఇంకా ప్రారంభం కాలేదు.
వాట్సప్ కొత్తగా పేమెంట్ ఆప్షన్ ప్రారంభించింది. కానీ సిగ్నల్ యాప్‌లో ఆ వెసులుబాటు లేదు. ఇంకా సిగ్నల్ పేమెంట్ ఆప్షన్‌పై దృష్టి సారించలేదు.
వాట్సప్‌లో ప్రతి చాట్‌కు తగ్గట్టుగా వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. కానీ సిగ్నల్ యాప్‌లో ఆ ఆవకాశం లేదు.
వాట్సప్‌కు సిగ్నల్ మరో ప్రధానమైన తేడా….స్టేటస్. వాట్సప్‌లో పెట్టినట్టు సిగ్నల్‌లో స్టేటస్ పెట్టలేం. వాట్సప్‌లోని ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్ స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. ఈస్టేటస్‌ను 24 గంటల వరకూ అవతలి వ్యక్తులు చూడగలుగుతారు.
వాట్సప్‌లో ఇతరుల క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా కాంటాక్ట్స్‌లో యాడ్ చేసుకునే వీలుంటుంది. కానీ సిగ్నల్‌లో అలాంటి ఫెసిలిటీ లేదు.
వాట్సప్‌లో ముఖ్యమైన మెస్సేజ్‌లను సేవ్ చేసుకోవడం అంటే స్టోర్ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా తరువాత ఎప్పుడైనా మరోసారి చూసుకోవచ్చు. సిగ్నల్ యాప్‌లో ఈ సౌకర్యం లేదు.