Add Zee Business As A Preferred Source
App

Indhu Rebecca Varghese: మేజర్ ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా..?

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Nov 02, 2024, 08:28 PM IST|Updated: Nov 02, 2024, 08:28 PM IST

Amaran: తాజాగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన అమరన్ సినిమా విడుదలై సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శివ కార్తీకేయన్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 

Who is Indhu Rebecca Varghese1/5

స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన అమరన్  సినిమాలో ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా.. ఆయన భార్య ఇందు పాత్రలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అత్యంత అద్భుతంగా ఒదిగిపోయింది. 

Indhu Rebecca Varghese real life photos 2/5

2014 లో భారతదేశాన్ని కుదిపేసిన  పుల్వామా దాడిలో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ముకుంద్ నిజమైన భార్య ఇందు రెబెక్కా  వర్గీస్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అమరన్ ప్రమోషన్స్ లో పాల్గొని తన భర్త గురించి చెప్పి అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈమె ఏం చేస్తోంది? ఎక్కడుంది ?అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Indhu Rebecca Varghese3/5

ఇందు.. క్రైస్తవ, హిందూమతానికి చెందిన మహిళ.  ఈమె, ఈమె భర్త ముకుంద్ అనేక పోరాటాల తర్వాత వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఎనిమిదేళ్లకే ముకుంద్ మరణించడంతో ఆమె బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. ప్రేమించి ఇంట్లో పెద్దలతో గొడవపడి ఆ తర్వాత వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎనిమిదేళ్లకే భర్తను కోల్పోవడంతో ఆమె గుండె ముక్కలు అయింది.   

Indhu Rebecca Varghese4/5

ఇక టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసిన ఇందు ప్రస్తుతం టీచర్ గా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రాగా ప్రస్తుతం ఈమె తన కలను నెరవేర్చుకొని టీచర్గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఒక స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. 

Indhu Rebecca Varghese5/5

ఏది ఏమైనా భర్త ను కోల్పోయి ఒంటరిగా జీవితాన్ని భరించలేక,  పిల్లల్ని తీసుకొని ఆస్ట్రేలియాలో సెటిల్ అయినట్లు సినిమాలో చూపించారు.   నిజ జీవితంగానే ఈ సినిమా తెరకెక్కింది కాబట్టి ప్రస్తుతం ఈమె కూడా ఆస్ట్రేలియాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది.