Ravana: రావణుడు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎవరు చేశారు? తెలిస్తే షాకవ్వడం మీవంతు..

Ravana's Last Rites: దసరా పండుగ చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం. సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణున్ని యుద్ధంలో ఓడించి చంపేస్తాడు రాముడు. ఆ తర్వాత రావణుడికి అంత్యక్రియలు ఎవరు చేశారు? అసలు ఏం జరిగింది మీకు తెలుసా?
 

1 /5

Ravana's Last Rites: సీతమ్మను మారువేశంలో వచ్చి రావణుడు ఎత్తుకెళతాడు. ఆ తర్వాత రామరావణుల యుద్ధం జరుగుతుంది. రాముడికి వానర సైన్యం ఉంటుంది. ఇక మహారాజు అయిన రావణుడికి పది తలలు కలిగి ఉంటాడు.  

2 /5

యుద్ధంలో ఎట్టకేలకు మంచి గెలుస్తుంది. అంటే రామాయణం ప్రకారం రాముడి చేతిలో రావణుడు ఓడిపోతాడు. చివరకు ప్రాణాలు వదిలేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? రావణుడికి అంత్యక్రియలు ఎవరు నిర్వహించారు?  

3 /5

పురాణాల ప్రకారం రావణుడు చనిపోయిన తర్వాత అతని భార్య మండోదరి బాధపడుతుంది. రావణుడి సోదరుడు అయిన విభీషణుడు కూడా సోదరుడి చావు చూసి తీవ్రంగా దుఃఖిస్తాడు. కానీ, రావణుడికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాడు.  

4 /5

అయితే, విషయం తెలుసుకున్న రాముడు, విభీషణుని అంత్యక్రియలు చేయాలని సూచిస్తాడు. ఎందుకంటే రావణుడు ఒక బ్రాహ్మణుడు అంతేకాదు జ్ఞానవంతుడు. అలాంటి రావణుడికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరపాలని రాముడు చెబుతాడు. ఆ మాటతో మనస్సు మార్చుకున్న విభీషణుడు రావణుని అంత్యక్రియలు నిర్వహిస్తాడు.  

5 /5

కానీ, మరో కథనం ప్రకారం విభీషణుడు రావణ దహనానికి ముందుకు రాడు. ఇప్పటికీ రావణ దహనం జరిగిందా? లేదా? అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని నిజం. రాముడు సూచించినా విభీషణుడు అంత్యక్రియలు చేయలేదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)