Kumki Elephants: కుమ్కీ ఏనుగుల కోసం పక్కారాష్ట్రానికి పవన్ కళ్యాణ్ .. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమ్కీ ఏనుగుల కోసం ఈరోజు కర్ణాటక సీఎంతో భేటీ అయ్యారు. దీంతో చాలా మంది కుమ్కీ ఏనుగుల స్పెషాలిటీ ఏంటని కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

1 /6

ఇటీవల కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పంటపోలాల మీద గుంపులుగా దాడిచేసి నానా బీభత్సం చేస్తున్నారు. అడ్డువచ్చిన అమాయకుల్నితుండంతో ఎత్తి పడేస్తున్నాయి.  దీంతో జనాలు ఏనుగులను చూసి భయంతో పారిపోతున్నారు.   

2 /6

ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు, పార్వతిపురంలో ఏనుగులు నానారచ్చ చేస్తున్నాయి.  పంటపోలాలను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అసలు కుమ్కీ ఏనుగులు అంటే ఏమిటీ, వీటికి ఎందుకంతా డిమాండ్ అనే చర్చమరోసారి తెరమీదకు వచ్చింది.  

3 /6

 కొన్ని ఏనుగులను మావాటివాళ్లు మచ్చిక చేసుకుని పెంచుకుంటారు. వీటిని సంతానం కల్గినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.వీటిని ప్రత్యేకమైన ఫుడ్ ను పెడతారు.  ఇతర ఏనుగుల కాకుండా వీటిని ప్రత్యేకంగా ట్రైన్ చేస్తారు. దీంతో ఇవి బలిష్టంగా తయారౌతాయి. 

4 /6

అదే విధంగా ఇవి తమ మావటి వాళ్లు చెప్పింది.. తూచా తప్పకుండా పాటిస్తాయి. ఇవి పెరిగి పెద్దవయ్యాక.. వీటిని గ్రామాల్లో ప్రవేశించిన అడవి ఏనుగుల్ని ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. అడవిలోని ఏనుగుల్ని మరల అడవిలోకి తరిమేలా చేయిస్తారు.

5 /6

ఈ కుమ్కీ ఏనుగులు మావటి వాళ్లు చెప్పిందే వింటాయి. అందుకు వీటిని ప్రత్యేకంగా ఆయా ప్రభుత్వాలు ప్రొత్సహిస్తాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కుమ్కీ ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అదే విధంగా వీటిని వివిధ రాష్ట్రాలలో  ఉత్సవాలకు, తిరునాళ్లకు కూడా అద్దెకు తీసుకెళ్తుంటారు.   

6 /6

కొన్నిసార్లు కుమ్కీలను గాయపడిన ఏనుగుల్ని కాపాడటం కోసం, అడవిలో దాడులు చేస్తున్న ఏనుగుల్ని శాంత పర్చడం కోసం కూడా  ఉపయోగిస్తారు. దీనివల్ల అడవి ఏనుగుల్ని మానవ స్థావరాలకు దూరంగా తరిమేస్తుంటారు.