Sreeleela: శ్రీలీల తెలుగులో ప్రస్తుతం బుల్లెట్ లా దూసుకుపోతున్న భామ.. అంతేకాదు తెలుగులో వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ దుమ్మురేపుతోంది. గతేడాది ఈ భామ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో పాటు.. అల్లు అర్జున్ పుష్ప 2లో చేసిన కిస్సీక్ సాంగ్ తో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ రెండు పాటలతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయింది.
శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తోన్న సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. గతేడాది ఈ భామ మహేష్ బాబు సరసన నటించిన ‘గుంటూరు కారం’ మూవీతో పలకరించినా.. పెద్దగా ప్రయోజనం దక్కలేదు. కానీ ఈ సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ లో అదరిపోయే స్టెప్పులతో అలరించింది. ఈ పాట 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూట్యూబ్ లో వీక్షించిన సాంగ్ గా రికార్డులకు ఎక్కింది.
2024 యేడాది చివర్లో మాత్రం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’లో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది. కెరీర్ లో తొలిసారి పుష్ప 2లో ఐటెం సాంగ్ చేసింది. స్వతహాగా మంచి డాన్సర్ అయిన శ్రీలీలకు 2024లో తన సాంగ్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ యేడాది శ్రీలీల ‘రాబిన్ హుడ్’తో పాటు పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో పాటు..రవితేజతో చేస్తోన్న సినిమాలపై శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది.
శ్రీలీల విషయానికొస్తే.. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' తెలుగులో అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకులను మెప్పించింది.
శ్రీలీల.. హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ తెలుగు మూవీతోనే ఓవర్ నైట్ పాపులర్ అయింది. ప్రస్తుతం తెలుగులో వరుస ఛాన్సులతో క్రేజీ భామగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. ప్రస్తుతం సినిమాలతో పాటు MBBS చేస్తోంది. ఈ యేడాది ఈమె డాక్టర్ చదవు కంప్లీటయ్యే అవకాశాలున్నాయి.స్వతహాగా తెలుగు భామ అయిన ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. అక్కడ కన్నడలో వచ్చిన 'కిస్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.