World Largest Cemetery: సాధారణంగా మీ అందరికీ ప్రపంచంలో ఎత్తైన భవనం, అతి పెద్ద హోటల్ , ఎత్తైన విగ్రహం, ఎత్తైన పర్వతం, పొడవైన నది, లోతైన సముద్రాల గురించి తెలిసుంటుంది. కానీ ప్రపంచంలో అతి పెద్ద శ్మశాన వాటిక గురించి తెలిసుండదు.
World Largest Cemetery: ప్రపంచంలో అతి పెద్దదైన శ్మశాన వాటిక ఇరాక్ దేశంలో ఉంది. రోజుకు 200 కంటే ఎక్కువ మృతదేహాల్ని ఖననం చేస్తుంటారు. 14వ శతాబ్దం నుంచి ఈ శ్మశాన వాటికకు డిమాండ్ పెరుగుతోందట. దీనికి సంబంధించిన కథనాలు, విశేషాలు ఇలా ఉన్నాయి
గతంలో షియా ముస్లింలు తరచూ ఇక్కడికి సందర్శించేవారు. తామెవరైనా మరణిస్తే ఇదే శ్మశాన వాటికలో ఖననమయ్యేలా చేయాలని ప్రార్ధనలు చేస్తుంటారు. ఈ శ్మశాన వాటిక విస్తీర్ణం పెరిగే కొద్దీ స్థలం లోటు ఏర్పడసాగింది. ఖననం చేయాల్సినవి పెరిగిపోతున్నాయి. 2013లో అంటే పదేళ్ల ముందుతో పోలిస్తే ఇవాళ ఈ శ్మశాన వాటికలో ఖననం ఖర్చు 5 మిలియన్ ఇరాకీ దీనార్లు.
ఈ శ్మశాన వాటికలో లక్షలాదిమంది ఖననమయ్యారు. షియా ముస్లింలు తమ కుటుంబీకులు లేదా బంధువుల్ని ఇక్కడే ఎందుకు ఖననం చేయాలనుకుంటారనే విషయం ఆసక్తి కల్గిస్తుంది.
మీడియా నుంచి వచ్చే కథనాల ప్రకారం ఈ శ్మశాన వాటికలో రోజుకు 200 కంటే ఎక్కువ మృతదేహాలకు ఖననం జరుగుతుంటుంది.
ఇరాక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్స్ వచ్చినప్పటి నుంచి ఈ శ్మశాన వాటిక పెరుగుతూ వస్తోంది.
ఈ శ్మశాన వాటిక పేరు వాదీ అల్ సలామ్. దీనర్ధం వ్యాలీ ఆఫ్ పీస్ అంటే శాంతి లోయ అని వస్తుంది. ఈ నగరం షియా ముస్లింలకు ప్రత్యేకమని చెప్పాలి. అందుకే షియా ముస్లింలు తమ వారెవరైనా చనిపోతే ఇక్కడే ఖననం చేయాలని భావిస్తుంటారు
ఇరాక్ దేశస్థులు తమ సమీప బంధువులు కావల్సిన వారిని ఒకే చోట ఖననం చేస్తుంటారు. ఇది కాలక్రమంలో అతిపెద్ద శ్మశాన వాటికగా మారిపోయింది.
ఇరాక్ దేశంలోని నజఫ్ పట్టణంలో ఉన్న ఈ ఇస్లామిక్ సాంప్రదాయ శ్మశాన వాటిక ప్రపంచంలోనే అతిపెద్దది