World largest Rivers: నదుల్ని సంరక్షించినంతవరకూ భూమి సురక్షితంగా ఉంటుంది. అందుకే నదుల్ని జీవనదులుగా పిలుస్తారు. నదులు సాధారణంగా అడవులు దాటుకుని నగరాల మధ్యలోంచి ప్రవహిస్తుంటాయి. దాంతో మనిషి నుంచి జంతుజీవాలన్నింటికీ ప్రయోజనం కలుగుతుంటుంది. ప్రపంచంలో అత్యధికంగా నీళ్లిచ్చే నదులేంటో తెలుసుకుందాం..
యంగ్త్ జే యంగ్త్ జే నది చైనాలోని అతి పొడవైన నది. ఇదే దేశంలో ప్రవహిస్తుంది. తూర్పు చైనా సముద్రంలో కలిసే ఈ నది సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీటిని డిశ్చార్జ్ చేస్తుంది.
ఓరినోకో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా, కొలంహబియాలో ప్రవహించే ఓరినికో నది పొడవు దాదాపుగా 2,250 కిలోమీటర్లు. ఈ నది అట్లాంటిక్ మహాసముద్రంలో సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుంది.
కాంగో ఆఫ్రికాలోని కాంగో నదికి మరో పేరు జాయ్ రే. సెకనుకు 41,400 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలో విడుదల చేస్తుంది. ఈ నది అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది.
గంగా బ్రహ్మపుత్ర మేఘన ఇండియా, టిబెట్, బంగ్లాదేశ్లో ప్రవహించే గంగా, బ్రహ్మపుత్ర, మేఘనలు కలిసి ఓ పెద్ద ప్రవాహంగా మారతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఇదే. ఈ నదులు బంగాళాఖాతంలో సెకనుకు 43.950 క్యూబిక్ మీటర్ల నీటిని వదులుతాయి.
అమెజాన్ దక్షిణ అమెరికాలో ప్రవహించే అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నదిగా చెబుతారు. ఈ నది సెకనుకు 224 వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుంటుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ప్రవహిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.