World Deadliest Birds: ప్రకృతిలో కన్పించే పక్షులు సాధారణంగా ప్రమాదకరమైనవి కానేకావు. కానీ ఇది అన్ని పక్షుల విషయంలో కాదు. కొన్ని పక్షులు కచ్చితంగా ప్రమాదకరమే. అలాంటి పక్షుల గురించి తెలుసుకుందాం..
World Deadliest Birds: ప్రపంచంలో కొన్ని పక్షులు అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఎంత ప్రమాదకరమంటే..రెప్పపాటుకాలంలో పని ముగించేస్తాయి. తేరుకునే సమయం కూడా ఇవ్వవు..
సదరన్ క్యాసోవరి ప్రపంచంలోని ప్రమాదకర పక్షుల్లో ఒకటి సదరన్ క్యాసోవరి. ఆస్ట్రేలియాకు చెందిన ఈ పక్షి చేసే దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి.
పిట్హోయి పక్షి న్యూ గినియాలో మాత్రమే కన్పించే ఈ పక్షిచాలా విషపూరితమైందిగా చెబుతారు. తన గోర్లతో దాడి చేసిందంటే ఇక బతకడం కష్టమే అంటారు.
ల్యామర్గియర్ ఈ పక్షిని ల్యాంబ్ వల్చర్ అని కూడా పిలుస్తారు. దీని పట్టు ఎంత వేగంగా, గట్టిగా ఉంటుందంటే జంతువులు, పిల్లల్ని సైతం లేపుకుని ఎగిరిపోతుంది.
హార్పీ ఈగల్ ఇది దక్షిణ అమెరికాలో ఉండే పక్షి. ఈ పక్షి రెక్కలు దాదాపు ఆరున్నర అడుగుల పొడుగు ఉంటాయి. రెక్కల్లో, పంజాల్లో ఎంత బలం ఉంటుందంటే కోతుల్ని కూడా లేపుకుపోగలదు.
పక్షులు కూడా ప్రమాదకరమని అంటే సాధారణంగా ఎవరూ నమ్మరు. కానీ ప్రపంచంలో అలాంటి ప్రమాదకర పక్షులు కూడా ఉన్నాయి. ఆవేశంగా దాడి చేస్తాయి ఇవి.
ఆస్ట్రేలియన్ మేగ్పాయి ఆస్ట్రేలియన్ మ్యాగ్పాయి ఎవరినైనా టార్గెట్ చేయగలదు. ఈ పక్షి కారణంగా వేలాదిమంది గాయాలపాలవుతుంటారు. ప్రత్యేకించి ఇవి ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఉండేవారికి ఈ బాధ తప్పదు.