Devils Forest: ప్రపంచంలోని అతి రహస్యమైన భయంకర అడవి ఇదే, ఇక్కడికొస్తే సూసైడ్ తప్పదు

Devils Forest: ప్రపంచంలో కొన్ని వింతైన, భయంకరమైన, రహస్యమైన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, లోయలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో నేపధ్యం ఉంటుంది. అన్నింటిలో ఏదో అంతుచిక్కని మిస్టరీ దాగుంటుంది. 

Devils Forest: అలాంటిదే ఈ అటవీ ప్రాంతం. ప్రపంచంలోనే అతి రహస్యమైన, భయంకరమైన అటవీ ప్రాంతంగా చెబుతారు. రాత్రి వేళ ఈ అడవిలోంచి కేకలు విన్పిస్తుంటాయిట. ఈ అడవిలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలుంటాయని ప్రతీతి. ఈ అడవికి వెళ్లినవారు ఆత్మహత్య చేసుకుంటారని అంటారు. ఆ ఫోటోలు మీ కోసం.

1 /5

అడవిలోంచి విన్పించే కేకలు ఈ అడవిలో రాత్రి వేళ అరుపులు, కేకలు విన్పిస్తుంటాయంటారు. అందుకే దెయ్యాలు నివసించే రహస్యమైన అడవిగా పరిగణిస్తుంటారు.

2 /5

అడుగడుగునా హెచ్చరికలు ఈ అడవిలో అడుగడుగునా హెచ్చరికలుంటాయి. అడవి 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే ఇక్కడి స్థానికులు కూడా దారితప్పిపోతుంటారు. ఈ అడవిలో చాలా మృతదేహాలు లభ్యమౌతుంటాయి

3 /5

దెయ్యాల అడవిగా ఈ అడవిలోకి వచ్చిన వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే ఈ అడవిని అన్నింటికంటే రహస్యమైన దెయ్యాల అడవిగా చెబుతారు. ఈ అడవి టోక్యో నుంచి రెండు గంటసల దూరంలో ఉంది. ఈ అడవిలో దెయ్యాలు నివాసముంటున్నాయని, ఈ దెయ్యాలే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంటాయని అంటారు

4 /5

సూసైడ్ ఫారెస్ట్‌గా నామకరణం ఈ రహస్యమైన అడవిని సూసైడ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఈ అడవి జపాన్ దేశంలో ఉంది. ఈ అడవి పేరు ఓంకిగహ్రా, Aokigahara Suicide Forest.ఈ అడవిలో సూసైడ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. పచ్చని ఈ అడవి చూసేందుకు ఎంత అంతంగా ఉంటుందో..అడవిలోని నిశ్శబ్దం అంత భయం గొలుపుతుంటుంది.

5 /5

ఈ అడవిలో సూసైడ్ ఘటనలు ప్రపంచంలోని ఈ అతి రహస్యమైన, భయంకరమైన అడవిలో జనం ఆత్మహత్య చేసుకుంటారనే సంగతి చాలామందికి తెలియదు. ఈ అడవి వెనుక దాగున్న రహస్యం ఇంకా వెలుగులోకి రాలేదు. అందుకే ప్రపంచంలోనే అత్యత భయంకరమైన సూసైడ్ పాయింట్‌గా పిలుస్తున్నారు. ఈ అడవిపై నిరంతరం చాలా పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి