Worlds Dry Village: ప్రపంచంలో వర్షం పడని ఏకైక గ్రామం ఏదో తెలుసా

వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకాశం నుంచి పడే ప్రతి వాన చినుకు నేలను తడుపుతుంటుంది. ఒక్కో ప్రాంతంలో వర్షపాతం ఒక్కోలా ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒకే ఒక గ్రామంలో అసలు వర్షమనేదే పడదు. అసలీ గ్రామంలో ఇప్పటి వరకూ వర్షపు చినుకే లేదంటే ఆశ్చర్యమే మరి. 

Worlds Dry Village: వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకాశం నుంచి పడే ప్రతి వాన చినుకు నేలను తడుపుతుంటుంది. ఒక్కో ప్రాంతంలో వర్షపాతం ఒక్కోలా ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒకే ఒక గ్రామంలో అసలు వర్షమనేదే పడదు. అసలీ గ్రామంలో ఇప్పటి వరకూ వర్షపు చినుకే లేదంటే ఆశ్చర్యమే మరి. 
 

1 /5

ఈ గ్రామంలో ఉండేవారిలో మెజార్టీ ప్రజలు అల్ బోహ్రా, అల్ ముకరమా వర్గానికి చెందినవారు. ఈ వర్గం ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు చాలా ప్రత్యేకమైనవి. 

2 /5

ఈ గ్రామంలో వర్షపాతం లేకపోయినా పర్యాటకంగా చాలా ప్రసిద్ధి చెందింది. కొండప్రాంతం, చారిత్రాత్మకమైన వాస్తు కళ కారణంగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఊరి ఇళ్లు ప్రాచీనంగా, ఆధునిక శైలిలో ఉంటాయి. 

3 /5

ఈ గ్రామం ఎత్తులో ఉండటం వల్ల వర్షపాతం ఉండదు. అల్ హుతైబ్ గ్రామం సముద్రమట్టానికి ఏకంగా 3200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాధారణంగా మేఘాలు 2000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ మేఘాలు ఊరికి దిగువలో ఉండటం వల్ల వర్షాలుండవు.

4 /5

యెమెన్ రాజధాని సనాకు కొద్దిదూరంలో ఉంది ఈ ఊరు. ఈ ఊరు చాలా అందంగా, మనోహరంగా ఉంటుంది. అల్ హుతైబ్ గ్రామం కొండపై ఉండే గ్రామం. ఈ ఊరి నుంచి దిగువకు చూస్తే చాలా అందంగా కన్పిస్తుంది. చలికాలంలో చలి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో మాత్రం ఎండలు పేలిపోతాయి.

5 /5

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షం కురుస్తుంటుంది. కానీ యెమెన్‌లోని అల్ హుతైబ్ అనే గ్రామమిది. ఇక్కడ ఇప్పటి వరకూ ఒక్క చినుకు వర్షపాతం కూడా లేదు. ఈ గ్రామం అందంగా రమణీయంగా ఉంటుంది. అసలీ ఊరిలో వర్షం ఎందుకు పడదు