Xiaomi 15 Series: 200MP టెలిఫోటో లెన్స్‌తో Xiaomi 15 మొబైల్ సిరీస్‌ లాంచ్‌కానుంది.. ఐఫోన్‌ 16 పని అంతే ఇంకా!

Xiaomi 15 Series Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షియోమి (Xiaomi) మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఇది Xiaomi 15 Ultra పేరుతో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ ఐలాండ్‌తో మొట్టమొదట లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. షియోమి ఈ మొబైల్‌ సిరీస్‌ను రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ చేయబోతోంది. దీని బ్యాక్‌ సెటప్‌లో ఎంతో శక్తివంతంమైన 200MP టెలిఫోటో జూమ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది.
 

1 /7

ఈ Xiaomi 15 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ Xiaomi 15తో పాటు 15 ప్రో వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ వచ్చే 2025 ఏడాది అక్టోబర్ నెల చివరి వారంలో లాంచ్‌ చేయబోతోంది. కానీ 15 Ultra వేరియంట్‌ను మాత్రం ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.  

2 /7

షియోమి 15 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ బ్యాక్‌ సెటప్‌లో గుండ్రని కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా లైకా లోగో సెటప్‌ను కూడా అందిస్తోంది.   

3 /7

ఇక ఈ మొబైల్‌ సెటప్‌ ఫాక్స్ లెదర్ ఫినిషింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇవి వైట్‌తో పాటు బ్లాక్ కలర్ వేరియంట్‌లలో విడుదల చేయబోతోంది. దీంతో పాటు ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి వస్తోంది.   

4 /7

ఈ Xiaomi 15 Ultra సిరీస్‌ ప్రత్యేకమైన ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇది 200MP టెలిఫోటో జూమ్ లెన్స్‌తో ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన సాంసంగ్ సెన్సార్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 10mm పెరిస్కోప్ లెన్స్‌ కూడా అందుబాటులో ఉండబోతోంది.   

5 /7

ఇక హై ఎండ్‌ వేరియంట్స్‌లో నాలుగు-కెమెరాలతో అందుబాటులోకి రానుంది. ఇందులోని 3x జూమ్‌ సెటప్‌తో 50MP జూమ్ లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 50MP అల్ట్రావైడ్ కెమెరా కూడా లభిస్తోంది. 

6 /7

ఈ Xiaomi 15 Ultra సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ 32MP ఫ్రంట్ కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 90W వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ కూడా లభిస్తోంది.  

7 /7

ఇక ఈ వేరియంట్స్‌లో ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే.. ఇందులో ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా 2K LTPO మైక్రో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.