Yuvraj Singh Biopic: వెండితెరపై సిక్సర్ల వీరుడి ఆత్మకథ.. యువరాజ్‌ సింగ్‌ సినిమా ప్రకటన 

Yuvraj Singh Biopic Six Sixes Announced: మరో దిగ్గజ క్రీడాకారుడు యువరాజ్‌ సింగ్‌ జీవిత కథ సినిమాగా రాబోతున్నది. అతడి ఆత్మకథను వెండితెరపై తెరకెక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సిక్సర్ల వీరుడి ఆత్మకథ మరి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

1 /8

Yuvraj Singh Biopic: భారతీయ సినిమాల్లో ఎంతో మంది క్రీడాకారుల ఆత్మకథలు సినిమాలుగా తెరకెక్కాయి. ఇప్పుడు సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ ఆత్మకథ సినిమాగా రాబోతున్నది.

2 /8

Yuvraj Singh Biopic: భారత క్రికెట్‌ చరిత్రలో మరపురాని ఆటగాడు యువరాజ్‌ సింగ్‌. క్రికెట్‌ చరిత్రలోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు ఒక్క యువరాజ్‌ సింగ్‌దే.

3 /8

Yuvraj Singh Biopic: క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ జీవితం ఆదర్శప్రాయం. ఎన్నో కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా యువరాజ్‌ రాణించాడు.

4 /8

Yuvraj Singh Biopic: 2011లో వన్డే ప్రపంచకప్‌ భారత్‌కు రావడంలో యువరాజ్‌ సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. 2019లో క్రికెట్‌కు యువరాజ్‌ వీడ్కోలు పలికాడు.

5 /8

Yuvraj Singh Biopic: అంతేకాదు యువరాజ్‌ ప్రాణాంతక క్యాన్సర్‌ బారిన పడ్డాడు. క్యాన్సర్‌కు చికిత్స చేసుకుని పునర్జన్మ పొందాడు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక 2012లో మళ్లీ బ్యాట్‌, బంతి పట్టాడు.

6 /8

Yuvraj Singh Biopic: అందరికీ స్ఫూర్తిదాయకమైన యువరాజ్‌ సింగ్‌ ఆత్మకథను దృశ్యరూపకంగా టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ తీయనుంది. ఈ మేరకు నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, రవిభాగ్‌ చందక్‌ అధికారిక ప్రకటన చేశారు. వీరిద్దరూ గతంలో యానిమల్‌, కబీర్‌ సింగ్‌ సినిమాలతోపాటు సచిన్‌ టెండూల్కర్‌ డాక్యుమెంటరీ తీశారు. ఇప్పుడు యువరాజ్‌ జీవితచరిత్రను తీస్తుండడంతో క్రికెట్‌ అభిమానులతోపాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

7 /8

Yuvraj Singh Biopic: యువరాజ్‌ ఆత్మకథ 'సిక్స్‌ సిక్సెస్‌' అని టైటిల్‌ పెట్టారు. త్వరలోనే దర్శకులు, నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి. 

8 /8

Yuvraj Singh Biopic: సినిమాను వేగంగా తెరకెక్కించి వచ్చే ఏడాది విడుదల చేయాలని టీ సిరీస్‌ బృందం భావిస్తోంది.