జంతువులకు మనసు ఉంటుందా అనేది చాలా మందికి వచ్చే సందేహం. నిజానికి బాధ, సంతోషం, కోపం, ఆవేశం, జాలి, దయ ఇలాంటి ఎమోషన్స్ కేవలం మనుషులకే పరిమితం అనుకుంటాము. కానీ జంతువులకు కూడా ఈ ఇమోషన్స్ ఉంటాయి. దీనికి ఉదాహరణే ఈ వీడియో. సోషల్ మీడియాలో ( Social Media ) ఈ వీడియో బాగా వైరల్ ( Viral Video ) అవుతోంది. చాలా మంది షేర్ చేస్తున్నారు. దీనికి ఐఎఫ్ ఎస్ ( IFS) అధికారి సుశాంత నంద తన ట్విట్టర్  ఎకౌంట్ లో షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING




ట్రెండింగ్ వీడియోలో ( Trending Video ) ఒక చేప నేలపై పడిఉండటాన్ని మీరు చూడవచ్చు.  ఈ చేపను చూసిన కొన్ని పందులు దాన్ని నీటిలోకి నెట్టి దాని ప్రాణాలు  కాపాడుదాం అని అనుకుంటారు. దాని కోసం అవన్నీ ఒక్కటై నోటితో చేపను నెడుతూ చివరికి దానిని నీటిలో పడేస్తారు. ఈ వీడియోను చూసిన తరువాత చాలా మంది వాటిని తెగ మెచ్చుకుంటున్నారు. మనిషికి ఇబ్బంది వస్తే సాటి మనిషి స్పందించని ఈ రోజుల్లో చేప ప్రాణాలు కాపాడటానికి ఇవి కష్టపడుతున్నాయి.. వీటికి హ్యాట్సాఫ్ అని కొంత మంది కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి