Christmas Santa Claus: బైబిల్‌లో శాంటా క్లాజ్ పాత్ర ఉందా, ఎవరీ శాంటా క్లాజ్, ఏమా కధ

Christmas Santa Claus: క్రిస్మస్ పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది శాంతా క్లాజ్ తాత. తెలుగు గడ్డం, ఎర్రటి దుస్తులతో అలరిస్తున్నట్టుండే ఆ తాతను చూడగానే పిల్లల్లో హుషారొచ్చేస్తుంది. అసలు క్రిస్మస్ కు శాంటాక్లాజ్ కు ఉన్న సంబంధమేంటి, ఎవరీ శాంటాక్లాజ్ అనే వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 23, 2023, 10:43 AM IST
Christmas Santa Claus: బైబిల్‌లో శాంటా క్లాజ్ పాత్ర ఉందా, ఎవరీ శాంటా క్లాజ్, ఏమా కధ

Christmas Santa Claus: క్రైస్తవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానంగా కన్పించేది శాంటాక్లాజ్ తాత చేసే హడావిడి. శాంటాక్లాజ్ వచ్చాడంటే ఎన్నో బహుమతులు తీసుకొస్తాడని భావిస్తారు. అసలు శాంటాక్లాజ్ అనేది బైబిల్ లో ఉందా లేదా...ఆ విషయం తెలుసుకుందాం.

క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ శాంటాక్లాజ్. చిన్నపిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. క్రిస్మస్ నాడు శాంటాక్లాజ్ తాత వచ్చి మంచి మంచి బహుమతులిస్తాడు కాబట్టి చిన్నారులకు చాలా ఇష్టం. అందుకే శాంటాక్లాజ్ వేషధారణ లేకుండా క్రిస్మస్ వేడుకలుండవు. ఎర్రటి దుస్తులు, పొడవైన తెల్లటి గడ్డం, ముఖంపై చిరునవ్వు, చిన్నారుల్ని ఆడించే తాత ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. శాంటా క్లాజ్ కాస్తా పిల్లల దృష్టిలో శాంతా తాతయ్యగా మారాడు. 

జింగిల్ బెల్స్..జింగిల్ బెల్స్..జింగిల్ ఆల్ ది వే విన్పించిందంటే శాంటానే గుర్తుకురావాలి. క్రిస్మస్ వచ్చిందంటేచాలు..శాంటా క్లాజ్ వస్తాడు చిన్నారుల్ని ఆడించి బహుమతులిస్తాడని భావిస్తారు. అసలీ శాంటా క్లాజ్ ఎవరు, బైబిల్‌లో శాంటా క్లాజ్ ప్రస్తావన ఉందా లేదా, ఇది బైబిల్ పాత్రనా కాదా అనేది తెలుసుకుందాం.

ఎవరీ శాంటా క్లాజ్

శాంటా క్లాజ్ అనేది వాస్తవానికి బైబిల్ పాత్ర కానేకాదు. బైబిల్ గ్రంధంలో శాంటా క్లాజ్ ప్రస్తావనే లేదు. క్రీస్తుశకం 280లో టర్కీలో సెయింట్ నికోలస్ అనే ఓ బిషప్ క్రిస్మస్ పండుగ నాడు అందరూ ఆనందంగా గడపాలనే ఆలోచనతో పండుగకు ముందు పేదవారికి, పిల్లలకు సహాయం చేసేవాడు. ఎవరైనా నిద్రపోతుంటే పక్కనే డబ్బులు, కానుకలు పెట్టి వెళ్లిపోయేవాడు. పిల్లలకు నచ్చే బహుమతులు ఇచ్చేవాడు. అతడి మరణానంతరం చాలామంది ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. చాలామంది ధనికులు శాంటా క్లాజ్ రూపంలో వచ్చి తమ తమ ప్రాంతాల్లోని పేదలకు రహస్యంగా ఆర్ధిక సహాయం అందించడం, పిల్లలకు విలువైన బహుమతులు ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. అందుకే క్రిస్మస్ కు శాంటా క్లాజ్ పాత్రకు అంతటి సంబంధముంటుంది. నాటి నికోలస్ పాత్రనే కాలక్రమంలో శాంటా క్లాజ్ గా మారింది. 

వాస్తవానికి ఆప్పట్లో శాంటా క్లాజ్ ధరించే దుస్తులు నీలిరంగులో ఉండవి. కాని 1930లో కోకాకోలా కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఎరుపు రంగు వాడటం, అవి ప్రాచుర్యం పొందటంతో శాంటా క్లాజ్ అంటే ఎరుపు తెలుపు రంగులే అనే భావన వచ్చేసింది.

శాంటా క్లాజ్ అలియాస్ సెయింట్ నికోలస్ టర్కీకు చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ ఫిన్ లాండ్ దేశం మాత్రం పర్యాటకంగా ఆకర్షించేందుకు శాంటా క్లాజ్ తమ దేశస్థుడని ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా రొవానిఎమి అనే ఊరిని శాంటా ఊరుగా మార్చి అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. శాంటా హౌస్, శాంటా పోస్టాఫీసు ఇలా అన్నీ శాంటా పేరుతో మొదలెట్టారు. చాలామంది అందుకే క్రిస్మస్ నాడు ఫిన్ లాండ్ వెళ్తుంటారు. శాంటా పాత్ర బైబిల్ ప్రమేయం కాకపోయినా ఓ మంచి ఉద్దేశ్యంతో నాడు సెయింట్ నికోలస్ ప్రారంభించిన అందర్నీ ఆదుకోవాలనే ఆలోచన మంచిదైనందునే అంతగా ప్రాచుర్యం పొందుతోంది. 

Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News