Lunar Eclipse on 05th May 2023: మే 5న తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం!

Lunar Eclipse 2023: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చే నెల 05వ తేదీన ఏర్పడనుంది. ఈ ఖగోళ సంఘటన మూడు రాశులవారికి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 06:49 PM IST
Lunar Eclipse on 05th May 2023: మే 5న తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం!

Chandra Grahan on 5th May 2023: జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణాలను ప్రత్యేక ఖగోళ సంఘటనలుగా భావిస్తారు, ఎందుకంటే ఈ గ్రహణాలు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5, శుక్రవారం నాడు 08.45 నిమిషాలకు ప్రారంభమై.. మే 6 తెల్లవారుజామున ఒంటి గంటకు ముగియనుంది. 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2023 సంవత్సరంలో ఏర్పడే ఈ మొదటి చంద్రగ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణం అవుతుంది. ఈ కారణంగా సుతక్ కాలం భారతదేశంలో చెల్లదు. కానీ ఈ గ్రహణం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. చంద్రగ్రహణం కారణంగా మూడు రాశుల వారు ప్రయోజనం పొందుతారు. 

చంద్రగ్రహణం ఈ 3 రాశులకు వరం
మేషరాశి
చంద్రగ్రహణం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారంలో వృద్ధి పొందుతారు. 

Also Read: Surya Gochar 2023: మరో 5 రోజుల్లో సూర్యుడి రాశి మార్పు.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం..

సింహరాశి 
మే 5న జరగనున్న చంద్రగ్రహణం సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త పని ప్రారంభించడం లాభాన్ని ఇస్తుంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 

మకరరాశి
మకర రాశి వారికి చంద్రగ్రహణం శుభప్రదం అవుతుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీకు మీకు మీ ఉన్నతాధికారుల నుండి సహకారం అందుతుంది.

Also Read: Solar Eclipse 2023: మరో 12 రోజుల్లో వీరి అదృష్టం తిరగబడనుంది.. ఇందులో మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News