Vinayaka Shlokas: సాధారణంగా మనం ఎటువంటి పూజ మొదలుపెట్టిన.. మెుదట వినాయకుడి పూజతోనే మెుదలవుతుంది. ప్రతి హిందువు ఇంట్లో వినాయకుడి పతం ఉంటుంది.
వినాయకుడికి పూజ చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా.. మన మన జీవితం సాగుతుంది అనేది హిందువుల నమ్మకం. మరి అలాంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు, శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలు గణేశునికి పూజ చేసేటప్పుడు తప్పక పఠించాలి.
శుభం తెచ్చిపెట్టి వినాయకుడి మంత్రం:
వక్రతుండ మహా-కాయ సూర్య-కోటి సమప్రభ..నిర్విఘ్నం కురు మే దేవా సర్వ-కార్యేషు సర్వదా
మూల మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద్ సర్వజన్ జన్మయ్ వశమనయే స్వాహా
ఆశీర్వాద మంత్రం:
గజాననం భూత గణాధి సేవితమ్…కపిత్త జంబుఫలసార భక్తితం..ఉమా సుతం శోక వినాశ కరణమ్..నమామి విఘ్నేశ్వర పాద పంకజం..తత్పురుషయే విద్మహే..వక్రతుండయే ధీమహి
..తన్నో దంతి ప్రచోద్యాత్
..ఓం శాంతిః శాంతిః శాంతిః
సిద్ధి వినాయక మంత్రం
ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే..సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్..సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా
గణేశ గాయత్రీ మంత్రం
ఓం ఏకదంతాయ విద్యామహే..వక్రతుండాయ ధీమహి..తన్నో దంతి ప్రచోదయాత్
ఈ శ్లోకాలు వినాయకుడి కోసం స్వచ్ఛమైన మనసుతో పాటించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. మంచి ఆలోచనలతో సకల శుభాలు కలగాలని వేదుకుంటూ వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేస్తే ఎంతో మంచిది. ధ్యాన ముద్రలో మనసులో పఠించడం లేదా జపించడం ద్వారా ఎన్నో శుభాలు చేకూరతాయి.
వినాయక చవితి రోజు అనే కాదు.. ఏరోజైనా సరే వినాయకుడికి ఈ మంత్రాలు జపించడం వల్ల మనకెంతో మీరు చేకూరుతుంది.
ఇక వినాయక చవితి రోజు సంకల్పం కోసం ఏమి పఠించాలి అని ఎంతో మందికి సందేహముంటుంది.
సంకల్పం. ఇందుకోసం చేతిలో అక్షింతలు తీసుకొని..
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభనే ముహూర్తే శ్రీమహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతఖండే, భరత వర్షే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, కృష్ణా గోదావర్యోః మధ్యదేశే, స్వగృహే (సొంతిల్లు కానివారు లక్ష్మీ నివాస గృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం తిథౌ..సౌమ్య వాసరే శుభవాసరే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః .. గోత్రః ( అందరూ వారి వారి గోత్రం చెప్పుకోవాలి)… నామధేయః(కుటుంబంలో పెద్ద మాత్రమే చెబితే సరిపోతుంది) ……. గోత్రోద్భవస్య…… (తమ గోత్రం) నామధేయస్య (వినాయక పూజలో పాల్గొంటున్నవారితోపాటు అందరి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య (పెళ్లి అయినవారు మాత్రమే జపించాలి) మమ సహకుటుంబస్య, సబాంధవస్య క్షేమ ైస్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం…సమస్త దురితో పశాంత్యర్థం..సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవతా ముద్దిశ్య, వర్షేవర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.