CSK vs RCB match updates: ఐపిఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కేప్టేన్ విరాట్ కోహ్లీ ( RCB captain Virat Kohli ) నెమ్మదిగా ఫామ్‌లోకి వస్తున్నాడు. శనివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal challengers Bangalore ) జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు కేప్టేన్ విరాట్ కోహ్లీ ( 90 పరుగులు; 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు)తో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టేన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ( Chennai Super Kings ) మరో ఓటమి తప్పలేదు. Also read : DC vs RR match: చెలరేగిన మార్కస్, షిమ్రన్.. రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ ఘన విజయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచిన బెంగుళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal 33 పరుగులు; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోగా మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీ.. దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి ఆటను ముందుకు తీసుకెళ్లాడు. దేవ్‌దూత్ ఔట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ఏబి డివిలియర్స్ ( AB De Villiers ) శార్ధూల్ థాకూర్ బౌలింగ్‌లో రెండు బంతులకే ధోనీకి ( MS Dhoni ) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. డివిలియర్స్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ సైతం 14వ ఓవర్‌లో శామ్ కుర్రన్ వేసిన 3 బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి మొత్తంగా 10 బంతులకు 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులే చేసింది. Also read : SRH vs KXIP match highlights: పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్


ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శివం దూబేతో ( Shivam Dube 22 పరుగులు; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) నాటౌట్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధించిన 170 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాళ్లలో ఆరంభంలోనే ఓపెనర్స్ షేన్ వాట్సన్, డుప్లెసిస్ తడబడ్డారు. వాట్సన్ ( 14 పరుగులు; 18 బంతుల్లో 3 ఫోర్లు ), డుప్లెసిస్ ( 8 పరుగులు; 10 బంతుల్లో) లతోనే పెవిలియన్ చేరారు. డుప్లెసిస్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అంబటి రాయుడు ( Ambati Rayudu 42 పరుగులు; 40 బంతుల్లో 4 ఫోర్లు ) చివరి వరకు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ 17వ ఓవర్‌లో తాను వేసిన 3వ బంతికి రాయుడుని ఇరుసు ఉడన పెవిలియన్‌కు చేర్చాడు. Also read : KKR vs CSK match: చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా విజయం.. ధోనీకి మళ్లీ తప్పని ఓటమి


అంతకంటే ముందుగా 4వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన నారాయణ్ జగదీశన్ ( Narayan Jagadeesan 33 పరుగులు; 28 బంతుల్లో 4 ఫోర్లు)తో రాయుడికి అండగా నిలుస్తూ జట్టు స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ 14 ఓవర్‌లో నారాయణ్‌ని క్రిస్ మోరిస్ రనౌట్ చేయడంతో అతడి ప్రయత్నాలకి కళ్లెం పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ 10 పరుగులు చేయగా ఇక మిగతా ఆటగాళ్లంతా అంతకంటే తక్కువ స్కోర్‌తోనే సరిపెట్టుకుని సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్‌కి చేరారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 132 పరుగులే చేసింది. దీంతో ధోనీ సేనకు మరో ఓటమి తప్పలేదు. Also read : Sunil Gavaskar: అందరు కెప్టెన్లు కోరుకునే ఆ బౌలర్ ఎవరో చెప్పిన గవాస్కర్


మొత్తం ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో ధోనీ సేనకు పాయింట్స్ పరంగా మరిన్ని కష్టాలు తప్పడం లేదు. కాగా ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.