DC vs RR match: చెలరేగిన మార్కస్, షిమ్రన్.. రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ ఘన విజయం

IPL 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెచ్చిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ బ్యాట్‌తో, బాల్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఈ మైదానంలో ఇదే తక్కువ స్కోర్.

Last Updated : Oct 10, 2020, 02:29 AM IST
DC vs RR match: చెలరేగిన మార్కస్, షిమ్రన్.. రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ ఘన విజయం

IPL 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi capitals ) జట్టు రెచ్చిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్  ( Marcus Stoinis ) బ్యాట్‌తో, బాల్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్‌పై ( Rajasthan Royals ) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఈ మైదానంలో ఇదే తక్కువ స్కోర్. 

ఢిల్లీ ఆటగాళ్లలో షిమ్రన్ హెట్‌మెయిర్ ( Shimron Hetmyer 45 పరుగులు; 24 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులు ) చెలరేగిపోయాడు. మార్కస్ స్టొయినిస్ ( Marcus Stoinis 39 పరుగులు; 30 బంతుల్లో 4 సిక్సులు ) పరుగులు రాబట్టగా, ఆ తర్వాత అంతో ఇంతో అధిక పరుగులు రాబట్టిన వారిలో ఓపెనర్ పృథ్వీ షా (19), కెప్టేన్ శ్రేయాస్ అయ్యర్ (22), అక్షర్ పటేల్ (17), హర్షల్ పటేల్ (16) ఉన్నారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (5), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (5), రబడ (2) నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ (0) నాటౌట్‌తో సరిపెట్టుకున్నారు. Also read : David Warner: ఐపీఎల్‌లో సరిలేరు నీకెవ్వరూ

ఇక 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ( Yashasvi Jaiswal 34 పరుగులు; 36 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు ), రాహుల్ తెవాతియా ( Rahul Tewatia 38 పరుగులు; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) ఆకట్టుకున్నారు. 3వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టేన్ స్టీవ్ స్మిత్ ( Steve Smith 24 పరుగులు; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మరో ఓపెనర్ జాస్ బట్లర్ ( Jos Buttler 13 పరుగులు; 8 బంతుల్లో 2 ఫోర్లు) మాత్రమే చేశారు. 

ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ( Sanju Samson) 5 పరుగులతోనే నిరాశపరిచాడు. ఆండ్రూ టై 6 పరుగులు చేయగా ఇక మిగతా ఆటగాళ్లంతా ఆలోపు పరుగులతోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మరో 2 బంతులు మిగిలిఉండగానే 138 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆలౌట్ అయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్‌ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. Also read : SRH vs KXIP match highlights: పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News