close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

NZ vs SA: 50 ఓవర్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదింపు

ప్రపంచ కప్‌లో భాగంగా బర్మింగ్‌హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న 25వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

Updated: Jun 19, 2019, 04:45 PM IST
NZ vs SA: 50 ఓవర్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదింపు
Image Credits: Twitter/@BLACKCAPS

ఎడ్జ్‌బాస్టన్‌: ప్రపంచ కప్‌లో భాగంగా బర్మింగ్‌హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న 25వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభించడానికి కొద్దిసేపు ఆలస్యం కావడంతో 50 ఓవర్ల మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తిరుగులేని జట్టుగా కివీస్ ముందుకు దూసుకెళ్తుండగా సఫారీలు మాత్రం ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అది కూడా ఆప్ఘనిస్తాన్ లాంటి పసికూనపై గెలవడం ఆ జట్టుకు పెద్ద పేరేమీ తీసుకురాలేదు. 

నేడు కివీస్‌పై కూడా సౌతాఫ్రికా జట్టు గెలవకపోయినట్టయితే, ఆ జట్టు సెమీ-ఫైనల్స్‌ ఆశలకు గండి కొట్టినట్టే అవుతుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న నేటి మ్యాచ్‌ ఫలితంపై క్రికెట్ ప్రియుల్లో ఒకింత ఆసక్తి నెలకొని వుంది.