Chandrababu Done Special Poojas In Vijayawada Kanakadurga Temple: కొత్త సంవత్సరం 2025 సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆదివారం సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం.. అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.