Congress Candidates List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో నాలుగు స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కీలకమైన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. దేశంలోని 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వాటిలో తెలంగాణకు చెందిన నాలుగు స్థానాలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే న్యూఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రకటించిన జాబితాలో పార్టీ సీనియర్ నాయకులకు టికెట్లు లభించడం విశేషం. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్ సంచలన సవాల్
- ఆదిలాబాద్- డాక్టర్ సుగుణ కుమారి
- నిజామాబాద్- తాటిపర్తి జీవన్ రెడ్డి
- మెదక్- నీలం మధు ముదిరాజ్
- భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి
Also Read: Legal Notice: మీడియా సంస్థలకు కేటీఆర్ భారీ షాక్.. బామ్మర్దితో ఛానల్స్‌కు రూ.160 కోట్ల నోటీసులు
తాజాగా ప్రకటించిన జాబితాలో పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ దక్కడం విశేషం. నిజామాబాద్ స్థానం నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రభుత్వంలో పదవి దక్కుతుందని భావించారు. కానీ పార్టీ నాయకత్వం లోక్‌సభ బరిలో నిలిపింది. భువనగిరి స్థానానికి ఆశావహులు భారీగా ఉండడంతో ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక ఆసక్తి కలిగించింది. చివరికి పార్టీ సీనియర్ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. మూడు నెలల వ్యవధిలో రెండు మూడు పార్టీలు మారి అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు మెదక్ స్థానం దక్కడం విశేషం.
ఝార్ఖండ్: కుంటి- కాళీ చరణ్ ముండా, లోహర్దగ- సుఖ్‌దేవ్ భగత్, హజారిబాగ్- జైప్రకాశ్ భాయ్ పటేల్
మధ్యప్రదేశ్: గుణ- రావు యద్వేంద్ర సింగ్, దామోహ్- తావర్ సింగ్ లోధి, విదిశ- ప్రతాప్ భానుశర్మ
ఉత్తరప్రదేశ్: ఘజియాబాద్- డాలీ శర్మ, బులంద్‌షహర్ - శివరాం వాల్మికీ, సీతాపూర్- నకుల్ దూబే, మహారాజ్‌గంజ్- వీరేంద్ర చౌదరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook