తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఆయన కూడా టీడీపీకి గుడ్ బై చెబితే ....తెలంగాణలో టీడీపీ దూకాణం మూసుకోవాల్సి వస్తుంది కదూ. ప్రస్తుత పరిణామాలు ఈ దిశగానే పయనిస్తున్నాయి. రేవంత్ టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతోందన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీలో కొనసాగే విషయంలో డైలమాలో ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ బంపర్ ఆఫర్..
కాంగ్రెస్ లో చేరితే ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించే అవకాశముందని ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేయడంతో.... ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే దీన్ని తెలంగాణ టీడీపీ ఖండించింది. ఆయన టీడీపీలోనే కొనసాగుతారని పేర్కొంది. ఏది ఎలా ఉన్నా రేవంత్ బాట ఎటువైపు ఉందనే విషయం తేలాలంటే ఆయనే నోరు విప్పాల్సి ఉంది..
కాంగ్రెస్లోకి టి.టీడీపీ నేత రేవంత్రెడ్డి ?