తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు తగ్గినా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగట్ట నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ మహోగ్రంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 71 అడుగులు దాటడంతో భద్రాచలం నీట మునిగింది. రామాలయం చుట్టూ నీళ్లే ఉన్నాయి. పట్టణంలోని దాదాపు 10 కాలనీలు పూర్తిగా జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని భవంతుల మూడో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం వంతెనపై శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి
Badrachalam Flood: తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు తగ్గినా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగట్ట నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ మహోగ్రంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 71 అడుగులు దాటడంతో భద్రాచలం నీట మునిగింది. రామాలయం చుట్టూ నీళ్లే ఉన్నాయి. పట్టణంలోని దాదాపు 10 కాలనీలు పూర్తిగా జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని భవంతుల మూడో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం వంతెనపై శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి